అక్కడ లాక్ డౌన్ మే చివరి వరకూ ఉంటుందంటగా.... 

భారతదేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి తన ప్రభావాన్ని చూపిస్తోంది.అంతేగాక ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన పడి దాదాపుగా 450 పైచిలుకు మంది మరణించారు.

 Lock Down, May Ending, Kcr, Trs, Hyderabad, Telanagana, Corona Virus,-TeluguStop.com

మరో 11 వేల మంది ఈకరోనా వైరస్ తో బాధపడుతున్నారు. దీంతో ఇప్పటికే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

అంతేగాక అనవసరంగా ప్రజలు రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు జారీ చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావిత పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ మరింతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రముఖ వైద్య అధికారులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి నివేదికలు సమర్పించినట్లు సమాచారం.

అయితే ఇప్పటి వరకు హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలో దాదాపుగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇందులో 131 మంది కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

అయినప్పటికీ 286 మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు.ఈ వైద్య గణాంకాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మరో పక్క కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించినటువంటి లాక్ డౌన్ ఈనెల 14వ తారీకుతో ముగియాల్సి ఉంది.కానీ ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా ఈ లాక్ డౌన్ మే మూడో తారీఖు వరకు పొడగించారు.

దీంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నటువంటి, నిరుపేదలు చిరు వ్యాపారులు, పూటగడవని పేదలు, తదితరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube