అతనికి బ్రేకప్.. సహనటుడితో ఎమీ జాక్సన్ ఏఫైర్.. ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ వ్యక్తిగత విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తారు.ముఖ్యంగా తమ ప్రేమ, పెళ్లి విషయంలో మాత్రం తాము తీసుకునే నిర్ణయాలు బాగా వైరల్ అవుతుంటాయి.

 Amy Jackson Affair With Costar, Amy Jackson , Affair ,costar,bollywood-TeluguStop.com

ఒకరిని ప్రేమించి మరొకర్ని పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ముందే పిల్లలను కనడం ఇలాంటివి చాలా వెలుగులోకి వచ్చాయి.ఇక తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ఎఫైర్ కూడా అలాగే ఉంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆమె ఎవరో అంటే.

సినీ నటి ఎమీ జాక్సన్.

బ్రిటన్ కు చెందిన ఈమె తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించింది.ఈమె ఫ్యాషన్ రంగంలో మంచి మోడల్ గా నిలిచింది.అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రావడంతో ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది.2010లో తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక 2014 లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఆ తర్వాత ఐ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక మళ్లీ తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించకపోగా వరుసగా తమిళ, హిందీ భాషలలో నటించింది.

ఇక సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.నిత్యం తన హాట్ ఫోటోలతో తన శరీర అందాలను చూపిస్తూ బాగా రచ్చ చేస్తుంది.

మళ్లీ ఈ మధ్య హాలీవుడ్ లో అడుగు పెట్టింది.పైగా అక్కడ వెబ్ సిరీస్ లలో బాగా బిజీగా మారింది.

ఇదిలా ఉంటే.ఈమె గతంలో తన ఇంగ్లీష్ ప్రియుడు జార్జ్ పనాయాటౌతో సహజీవనం నుండి ఒక బిడ్డకు జన్మనిచ్చింది.ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారు అని వార్తలు కూడా వినిపించాయి.కానీ మళ్లీ ఆ పెళ్లి గురించి ఆమె ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

ఇక తాజాగా ఈమె మరో నటుడితో ఎఫైర్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Amy Jackson, Bollywood-Movie

పైగా అతడితో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.అతడి పేరు ఎడ్ వెస్ట్ విక్.అతడు ఒక ఆంగ్ల నటుడు.అతడు అక్కడ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక గత కొంత కాలం నుంచి ఎమీ జాక్సన్ ఇతడితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.పైగా అతడితో దిగిన ఫోటోలను ఈ హాట్ బ్యూటీ బాగా షేర్ చేసుకోవడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

ఈ ఫోటోలో వారిద్దరూ సన్నిహితంగా కలిసి ఉన్నారు.

లండన్ స్ట్రీట్ లో ఈ జంట చేతులు పట్టుకొని సన్నిహితంగా ఉన్నట్లు కనిపించగా.ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఇదంతా గాసిప్ మాత్రమేనా.లేదా జార్జి తో ఏమైనా విభేదాలు వచ్చి ఇలా చేస్తుందా అని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube