లవ్‌ యూ : అఖిల్‌, హారికల మధ్య ఏం జరుగుతుంది?

బిగ్ బాస్‌ సీజన్‌ 4 ను మొదటి నుండి ఫాలో అవుతున్న వారిని అఖిల్‌ ఎవరికి క్లోజ్‌ గా ఉంటాడు అంటూ ప్రశ్నిస్తే వెంటనే మోనాల్‌ తో అనే సమాధానం ఠక్కున వచ్చేస్తుంది.అందులో ఎలాంటి డౌట్‌ లేదు.

 Akhil And Harika Love In Telugu Bigg Boss,akhil, Harika, Love, Telugu Bigg Boss4-TeluguStop.com

మోనాల్‌ తో మొదట్లో అభిజిత్‌ కూడా క్లోజ్‌ గా ఉండేవాడు.కాని ఆమె తీరు నచ్చక పోవడంతో అభిజిత్‌ ఆమెకు దూరం అయ్యాడు.

ఆ తర్వాత హారిక లాస్యలతో అభిజిత్‌ సన్నిహితంగా మెలిగాడు.లాస్య ఎలిమినేట్‌ అయిన తర్వాత హారికతో మరింత క్లోజ్‌ గా అభిజిత్‌ అయ్యాడు.

ఇద్దరి మద్య ఏదో ఉందా అన్నట్లుగా క్లోజ్‌ అయ్యారు.అయితే హారిక వ్యవహారం చూస్తుంటే మొదట్లో మోనాల్‌ ఏం చేసిందో అలా చేస్తుంది అనిపిస్తుంది.

ఒక వైపు అభిజిత్‌ కు హగ్‌ లు ఇచ్చుకుంటూ మరో వైపు అఖిల్‌ కు చాలా క్లోజ్‌ అవుతుంది.

Telugu Abhijith, Akhil, Akhilharika, Harika, Love, Monal-Latest News - Telugu

నిన్నటి ఎపిసోడ్‌ లో హారిక చేతి మీద అఖిల్‌ లవ్‌ యు అంటూ రాశాడు.అది క్లీయర్‌ గా టెలికాస్ట్‌ అయ్యింది.ఇక టెలికాస్ట్‌ కానివి అన్‌ సీన్‌ లో ఉన్నవి అన్ని కలిపి చూస్తే ఇద్దరి మధ్య వ్యవహారం ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మొన్న ఒక రోజు ఎపిసోడ్‌ లో హారిక రాజుగా ఉన్న సమయంలో అఖిల్‌ నాకు ముద్దు పెట్టు పెట్టు అంటూ బలవంత పెట్టాడు.దాంతో హారిక ఇప్పుడు నేను రాజును నన్ను ముద్దు పెట్టు అంటున్నావేంటి, నేను తర్వాత ముద్దు పెడుతాలే అంటూ చెప్పింది.

తర్వాత ముద్దు పెట్టిందా లేదా అనేది చూపించలేదు.కాని ఇద్దరు ఆ తర్వాత కూడా చాలా క్లోజ్‌ గా మూవ్‌ అవుతూ ఉండటం జరిగింది. హారిక మరియు మోనాల్‌ లు చాలా మంచి బాండింగ్‌ ను కలిగి ఉన్నారు.అలాంటి వారు ఇద్దరు కూడా అఖిల్‌కు అత్యంత సన్నిహితంగా ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ మరియు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడు వీరి అసలు విషయం బయట పడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube