400 కోట్లు ఇస్తా అన్న కూడా సినిమా విడుదల చేయను అంటున్న నిర్మాత

కొవిడ్ మహమ్మారి దెబ్బతో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ బాగా నష్టపోయిన సంగతి అందరికీ తెలిసిందే.థియేటర్స్ చాలా కాలం పాటు క్లోజ్ అయి ఉండటంతో థియేటర్ ఓనర్స్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు.

 Adithya Chopra Rejecting 400 Crores Ott Offers-TeluguStop.com

ఇటీవల కాలంలో కొన్ని చోట్ల టాకీసులు ఓపెన్ అయ్యాయి.కానీ, కరోనా నేపథ్యంలో ఇంకా చాలా చోట్ల థియేటర్స్ తెరుచుకోలేదు.

ఈ క్రమంలోనే పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతూనే ఉంది.కొందరు మేకర్స్ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

 Adithya Chopra Rejecting 400 Crores Ott Offers-400 కోట్లు ఇస్తా అన్న కూడా సినిమా విడుదల చేయను అంటున్న నిర్మాత-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొందరు ఆల్రెడీ రిలీజ్ చేసేశారు.కాగా ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ మాత్రం తన సినిమాలను టాకీసుల్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఎన్ని వందల కోట్ల రూపాయల ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు.

ఆయన ఎవరంటే… బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా.

తన నిర్మాణ సంస్థ ఆదిత్య ప్రొడక్షన్‌లో ‘బంటీ ఔర్ బబ్లి , శంషేరా, పృథ్వీరాజ్, జయేశ్‌భాయ్ జోర్దార్’ వంటి చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.ఈ మూవీస్ కంప్లీట్ అయి దాదాపు రెండేళ్లు అయింది.

అప్పటి నుంచి కొవిడ్ వల్ల విడుదల కాకుండా అలానే ఆగిపోయి ఉన్నాయి.కరోనా వల్ల థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవు.

ఓటీటీలు ఇప్పటికే చాలా ఆఫర్స్ ఇచ్చాయి.కానీ, వాటికి ప్రొడ్యూసర్ ఆదిత్యా చోప్రా అస్సలు ఓకే చెప్పడం లేదు.

ఇకపోతే కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో మహారాష్ట్రలో థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.దీంతో థియేటర్స్ ఎప్పుడు కంప్లీట్‌గా ఓపెన్ అవుతాయి? ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి? అని బీ టౌన్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తున్నది.

Telugu Adithya Chopra, Amazon Prime, Amazon Primes Offers 400 Crores To Aditya Chopra, Bollywood, Bollywood Producer Aditya Chopra, Bunty Aur Bublee, Jayeshbhai Jordaar, Prudviraj, Shamshera, Theatrical Release Only-Telugu Stop Exclusive Top Stories

ఈ క్రమంలోనే ఓటీటీలకు నో చెప్పి.థియేటర్స్‌లోనే సినిమాలు విడుదల చేయాలని సంకల్పంతో ఉన్న ఆదిత్య చోప్రాను పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.ఈ నాలుగు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరుతూ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఆల్రెడీ ఆదిత్య చోప్రాను రూ.400 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు బీ టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, ఎన్ని కోట్లు ఇచ్చినా తన సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయాలని ప్రొడ్యూసర్ అదిత్య చోప్రా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

#Theatrical #BollywoodAditya #Amazon Prime #AmazonPrimes #Shamshera

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు