సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినీ తారలు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.మరి కొందరు మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ ఎంతో బిజీగానే ఉన్నారు.
అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అంతే తొందరగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో నటి రవళి( Ravali ) ఒకరు పెళ్లి సందడి సినిమాలో ఈమె నటన అద్భుతమని చెప్పాలి .ఇలా ఎన్నో సినిమాలలో నటించినటువంటి రవళి కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా రవళి ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఆమె తల్లి నటి విజయ దుర్గ ( Vijay Durga ) తెలియజేశారు.నటి విజయదుర్గ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వంట వీడియోలను అలాగే తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తన పిల్లల సినీ కెరియర్ గురించి ఈమె వెల్లడించారు.ఈ సందర్భంగా విజయదుర్గ మాట్లాడుతూ నా అసలు పేరు కనకదుర్గ.మాది స్వస్థలం గుడివాడ అయితే ఒకసారి చెన్నైలో దసరా నవరాత్రుల కోసం వెలుగా అక్కడి వాతావరణం నచ్చింది.దీంతో నేను పిల్లలతో పాటు అక్కడేకే షిఫ్ట్ అయ్యానని ఈమె తెలియజేశారు.

అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు నెలలకే తనకు సినిమా అవకాశాలు వచ్చిందని తెలిపారు.ఇలా తెలుగులోను తమిళంలోనూ దాదాపు 30 సినిమాల వరకు నటించానని ఈమె తెలియజేశారు.ఇండస్ట్రీలో అప్పటికే ఒక కనకదుర్గ ఉండడంతో నాకు విజయదుర్గా అని పేరు పెట్టారు.ఇక తన కుమార్తె హరిత( Haritha ) కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వగా ఆమె చాలా పొట్టిగా ఉందన్న కారణంతోనే తనకు అక్క చెల్లి లాంటి క్యారెక్టర్స్ ఇచ్చేవారు అయితే ఈమె సినిమాలకు దూరంగా ఉండి ప్రస్తుతం బుల్లితెరపై మంచి సక్సెస్ అయిందని విజయదుర్గ వెల్లడించారు.
ఇక తన మరో కూతురు రవళి ఇండస్ట్రీలో వచ్చి పలు సినిమాలలో నటించేవారు.అయితే ఆమె ఉన్నఫలంగా లావు అయ్యారు అన్న వార్తని ప్రచారం చేశారు.ఈ వార్త కారణంగా తనకు సినిమా అవకాశాలు రాలేకపోయాయని తెలిపారు.ఇక సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ పూర్తిగా దూరంగా ఉన్నారని అయితే ప్రస్తుతం మంత్రం అవకాశం వస్తే తిరిగి ఇండస్ట్రీ లోకి రావడానికి సిద్ధంగా ఉంది అంటూ విజయ్ దుర్గ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.