దాదాపు సినిమా రంగం పుట్టకముందే పుట్టి నాటకాల్లో ఒక వెలుగు వెలిగి.ఆతర్వాత సినిమాల్లోకి వచ్చి అమ్మగా, అమ్మమ్మగా, బామ్మగా ఎన్నో సినిమాల్లో తన నటనతో కామెడీతో మనల్ని ఎంతోగాను అలరించిన అలనాటి నటీమణి నిర్మలమ్మ గారు మనందరికి గుర్తుండే ఉంటారు.
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ నుండి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వరకు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది సూపర్ స్టార్లకి అమ్మ క్యారెక్టర్ కానీ అమ్మమ్మ క్యారెక్టర్ కానీ కావాలంటే ముందు నిర్మలమ్మ గారిని ప్రిఫర్ చేసేవారట.మన తెలుగు సినిమాల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన అతికొద్ది మంది నటీనటుల్లో నిర్మలమ్మ గారు కూడా ఒకరు.
ఎలాంటి సీన్ అయిన ఎంతో సాధారణంగా నటించేస్తుంది అలాగే ఈమె యాస కూడా ఈమె నటనకి సూట్ అవ్వడంతో మన తెలుగు ప్రేక్షకులు నిర్మలమ్మని బాగా ఆదరించారు.అంతేకాదు మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.
అందుకే నాగేశ్వరావు గారు అప్పట్లో నిర్మలమ్మ గారి గురించి ఒక మాట అన్నారు షూటింగ్ సమయంలో ఎవరో నటిగా కాకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరి బాధలను తెలుసుకునేదని, ఒక తల్లిలా మమ్మల్ని ఆదరించేదని అందుకే సరదాగా మేమందరం ఆమెని నిర్మలమ్మ అని పిలుచుకుంటాం అంటూ చెప్పారు నాగేశ్వరరావు ఇకపోతే ఈమె వ్యక్తిగత విషయాలకు వస్తే ఈమెని ఒక సినిమా షూటింగ్ లో చూసిన ప్రొడక్షన్ మేనేజర్ జీవి కృష్ణారావు ఆమెని చూసి ప్రేమలో పడ్డాడు.ఆ తర్వాత డైరెక్టుగా నిర్మలమ్మ ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడాడు.
దానికి అందరూ ఒప్పుకున్నారు అయితే నిర్మలమ్మ మాత్రం ఒక కండిషన్ పెట్టింది నేను పెళ్లయ్యాక కూడా నటిస్తాను దానికి ఓకే అయితే నిన్ను పెళ్లిచేసుకుంటాను అని చెప్పేసింది.అందకు అయన ఒప్పుకోవడంతో ఇద్దరు ఒకటయ్యారు.
ఇక పెళ్లయ్యాక నిర్మలమ్మ అండ్ కృష్ణారావు ఎన్ని ప్రయత్నాలు చేసిన వీళ్ళకి పిల్లలు కలగలేదు.దానికి కాస్త డిప్రెషన్ కి గురైన నిర్మలమ్మ అప్పడు సినిమాలకి బ్రేక్ తీసుకుంది.కొన్నాళ్ళు అసలు ఎవరికీ కనిపించలేదు.అయితే తన భర్త కృష్ణారావుకి ప్రొడక్షన్ మేనేజర్ గా అవకాశాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆదాయం సరిగా లేక అప్పులు చేసి చివరకు అన్ని అప్పులు తీర్చడానికి ఇద్దరు నాటక రంగంపై దృష్టి పెట్టారు.
అలా 1961 లో విడుదలైన కృష్ణ ప్రేమ సినిమా లో నిర్మలమ్మ అవకాశం లభించడంతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఆ తరువాత అస్సలు వెనుతిరిగి చూసుకోలేదు.
ప్రేమాభిషేకంలో శ్రీదేవి బామ్మగా మొదలైన ఈమె ప్రస్థానం ఎన్నో సినిమాల్లో అమ్మమ్మ, నాయనమ్మ, బామ్మ పాత్రలో ఒదిగిపోయి నటించి ఔరా అనిపించింది.ఇక నాగార్జున, హరికృష్ణ జంటగా నటించిన సీతారామరాజు సినిమాలో కోట శ్రీనివాసరావు అమ్మగా నాగమ్మ తరహలో చేతిలో కర్ర పట్టుకొని విలనిజం పండించింది మన నిర్మలమ్మ.ఇక చివరగా చిరంజీవి గారి స్నేహంకోసం సినిమా తర్వాత నిర్మలమ్మ పెద్దగా కనిపించలేదు
ఇక నిర్మలమ్మకి పిల్లలు లేరు ఆమె కవిత అనే ఒక ఆడ పిల్లను దత్తత తీసుకుని ఆమెకి పెళ్లి చేసి దగ్గరుండి అన్ని బాగోగులు చూసుకుంది ఇక ఈమె మనమడు విజయ్ మదాలఇతన్ని నట వారసుడిగా పడమట సంధ్యారాగం అనే సినిమాలో గణపతి పాత్రలో ఇండస్ట్రీకి పరిచయం చేసింది.అయితే ఈయన పుట్టినప్పటి నుండి అమెరికాలోనే ఉండడం వలన తెలుగు సరిగ్గా మాట్లాడ్డం రాదు.ఇక ఈయనకు శోభా అనే అమ్మాయితో వివాహం కాగా వీరికి ఒక అమ్మాయి కూడా వుంది.అయితే మనవాడి పెళ్ళిచూడాలని ఎంతో ఆశపడ్డ నిర్మలమ్మ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది.
ఎన్నో పాత్రలతో మనల్ని అలరించిన నిర్మలమ్మ గారు 2009 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మృతి చెందారు.