చిరంజీవి ఆచార్య మూవీ సెన్సార్ టాక్ ఇదే.. సినిమాకు అదే మైనస్ అయిందంటూ?

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 3400కు పైగా థియేటర్లలో విడుదల కానుంది.ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

 Acharya Movie Censor Talk Details Here Goes Viral Acharya , Chiranjeevi , Kora-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని తెలుస్తోంది.ఆచార్య మూవీ రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలు అని బోగట్టా.

కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాల నిడివితో పోల్చి చూస్తే ఈ నిడివి తక్కువే కావడం గమనార్హం.ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండాలంటే నిడివి ఎక్కువగా ఉండకూడదని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఇప్పటికే ఇక్కడ జరిపిన ఈవెంట్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేకర్స్ ఈ ఈవెంట్ ను కూడా ఇక్కడే నిర్వహించాలని భావిస్తున్నట్టు బోగట్టా.

Telugu Acharya, Censor, Kajal Agrawal, Koratala Shiva, Pooja Hegdhe, Tolllywood-

సెన్సార్ టాక్ ప్రకారం సినిమాలో ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందని సమాచారం అందుతోంది.సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది.ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.మరోవైపు కొరటాల శివ సినిమాలలో క్లైమాక్స్ వీక్ గా ఉంటుందని గత సినిమాల విషయంలో ప్రూవ్ అయింది.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఆ తప్పు జరగకుండా కొరటాల శివ జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.చిరంజీవి సైతం ఆచార్య సినిమా స్క్రిప్ట్ విషయంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఆచార్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.ఆచార్య బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube