ఇప్పుడు ప్రతి ఒక్కరు లైకుల కోసం, సెల్ఫీలు తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాము.దాని కోసం దేనికైనా, ఏమి చేయడానికి సిద్ధపడి పోతుంటారు.
కొందరు జంతువులతో, పక్షులతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తుంటారు.రైళ్లు వస్తున్నప్పుడు, కొండల్లో, కోణాల్లో, అడవుల్లో, సముద్రాల దగ్గర, పాముల దగ్గర, బైకులు మీద వెల్తూ, కార్లలో వెల్తూ, సెల్ఫీలు తీసుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డ వారున్నారు.
ప్రాణాల మీదకి తెచుకున్నవారున్నారు.ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వున్నారు, ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాము.
అలాగే ఓ యువతి మేకతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు అక్కడ జరిగింది ఇంకొకటి.ఆ యువతి తాళ్లతో కట్టేసి ఉన్న మేక వద్దకు సెల్ఫీ వీడియో తీసుకునేందుకు వెళ్తుంది.మేకను తాళ్లతో కట్టేసి ఉంచడంతో ధైర్యంగా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
కానీ ఆ మేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.సెల్ఫీ తీసుకుంటున్న యువతి ఆ మేకను చూసుకోకుండా కెమెరా ను సెట్ చేసుకుంటూ ఉంటుంది.
ఆ మేకకు ఏమనిపించిందో పాపం ఒక్కసారిగా వెనకనుండి వచ్చి గట్టిగా ఆ యువతి తలపై బలంగా కుమ్మతుంది.ఒక్కసారిగా ఏమి జరిగిందో ఆ యువతికి అర్థంకాదు.
సెల్ఫీ తెచ్చిన తంటాలు ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.