కొత్త మంత్రివర్గం పై నిర్ణయం మార్చుకున్న జగన్ ? 

గత కొద్ది రోజులుగా ఏపీ కేబినెట్ ప్రక్షాళన అంశంపై వైసిపి తో పాటు , ఏపీ రాజకీయ వర్గాల్లోనూ రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్న జగన్ దీనిపై కసరత్తు చేసేందుకు,  ఎవరెవరిని ఏ ఏ శాఖల మంత్రిగా నియమించాలనే విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు సిమ్లా టూర్ ను ఉపయోగించుకున్నారు అనే ప్రచారం జరిగింది.

 Jagan, Ap Government, Ap Cabinet, Ysrcp, Seniour Minister, Ap Revenue Minister,-TeluguStop.com

అంతే కాదు జగన్ మొదట్లో చెప్పినట్లుగా ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ మంత్రులందరినీ రెండున్నర సంవత్సరాల తర్వాత తొలగిస్తామని , మరో రెండున్నరేళ్లు మంత్రులుగా వేరే వారిని తీసుకుంటామని,  మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందు చెప్పారు.జగన్ పూర్తిగా మంత్రివర్గాన్ని మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తారని అందరూ అభిప్రాయపడ్డారు.

 అయితే పూర్తిగా మంత్రిమండలిని మారిస్తే తనకు అత్యంత సన్నిహితులు,  సీనియర్ నాయకులు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవతాయి అనే ఉద్దేశంతో 90 శాతం మందిని మాత్రమే మార్చి మిగిలిన 10 శాతం మందిలో కీలకమైన , తనుకు సన్నిహితమైన వారికి మంత్రి పదవులను అలానే ఉంచేస్తారని ప్రచారం జరిగింది.అయితే జగన్ మాత్రం ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు.

ఏపీ ప్రభుత్వానికి కీలకమైన ఆర్థిక, రెవెన్యూ,  గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ విషయంలో సీనియర్ నాయకులకు జగన్ బాధ్యతలు అప్పగించారు.ఇవి క్లిష్టమైన శాఖలు కావడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలు కావడంతో,  ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ శాఖల్లో కొత్త వారిని మంత్రులుగా ఎంపిక చేసినా, వారు ఆ శాఖలపై పూర్తిగా పట్టు సాధించేందుకు చాలా సమయం పడుతుందని, పూర్తిగా తమ శాఖల పై పట్టు సాధించే సరికి ఎన్నికల సమయం దగ్గర కు వస్తుందని, ఈ లోపు ఆ శాఖలో పాలన గాడి తప్పుతుంది అని జగన్ అభిప్రాయ పడుతున్నారు.

Telugu Ap, Jagan, Jagan Simla, Muncipal, Ysrcp-Telugu Political News

అందుకే అందరిని మార్చడం కంటే, కొన్ని కీలకమైన మంత్రిత్వశాఖలు విషయంలో రాజీ పడడం బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారట.అందుకే ముందుగా అనుకున్న నిర్ణయం ప్రకారం మొత్తం అందరిని మార్చకుండా, కొన్ని కీలక మంత్రిత్వశాఖల విషయంలో రాజీ పడాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube