హీరో కార్తికేయకు ఘోర అవమానం... అసలేమైందంటే?

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది కోరుకుంటారు.కొంత మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది.

 A Terrible Insult To The Hero Karthikeya , Actor Karthikeya, Hero Karthikeya, Te-TeluguStop.com

ప్రయత్నాలు చాలా మంది చేస్తారు.కాని అవకాశాలు మాత్రం కొద్ది మందికి మాత్రమే వస్తాయి.

అయితే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో చాలా రకాల సంఘటనలు ఎదురవుతుంటాయి.ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మొదట్లో సినిమా ప్రయత్నాలు చేసి ఇప్పుడు స్టార్ గా ఎదిగిన వారు కొన్ని కొన్ని సందర్భాలలో తమ అనుభవాలను పంచుకుంటారు.

ఇక అవకాశాలను సాధించుకునే క్రమంలో ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే అప్పుడు ఆ సదరు నటుడికి బాధాకరంగా అనిపించినా ఆ తరువాత అవి చాలా తీపి గుర్తులలా అనిపిస్తాయని చాలా మంది నటులు చెప్పగా మనం విన్నాం.

అయితే తాజాగా హీరో కార్తికేయ నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకు జరిగిన ఒక అవమానాన్ని ఓ ఇంటర్వ్యూ లో వివరించాడు.అయితే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని కలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆఫీస్ కు వెళ్తే గంటల తరబడి నిరీక్షించినా కలవడం సాధ్యపడలేదని, అయితే టెంపర్ సినిమా షూటింగ్ సమయంలో పూరీ జగన్నాథ్ ని కలవడానికి వెళ్తే బౌన్సర్స్ నన్ను తోసేసారని, ఆ తరువాత పూరీ జగన్నాథ్ చూసి నంబర్ తీసుకొని అవకాశం ఉంటే తెలపుతానని అన్నాడని, ఆ తరువాత ఈ విషయాన్ని పూరీ గారికి తెలిపానని కార్తికేయ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube