మునుగోడు ఎమ్మెల్యే మందుపై ముందు చూపు...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని బెల్ట్ రహిత నియోజకవర్గంగా మార్చేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు.బెల్ట్ షాపులు లేకుండా చేస్తే ఆ గ్రామానికి రూ.

5 లక్షలు నజరానా ప్రకటించి సంచలనం రేపారు.అంతటితో ఆగకుండా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను నియంత్రణ కమిటీలు వేస్తూ ముందు చూపుతో ముందుకు వెళుతున్నారు.

A Preview Of MLA's Drug , MLA Komatireddy Rajagopal Reddy, Belt Shops-మున�

మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకొని, రాత్రిపూట గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో రాత్రి పూట మీటింగ్ పెట్టి,గ్రామంలో బెల్ట్ షాపులు( Belt shops ) మూసి వేయిస్తామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా బుజ్జమ్మ అనే మహిళ తన భర్త ప్రతిరోజూ తాగొస్తున్నాడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది.

బెల్టు షాపుల ద్వారా మందు అమ్మడం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు రాజగోపాల్ రెడ్డికి విన్నవించుకున్నారు.బెల్ట్ షాపులను బంద్ చేయించాల్సిన బాధ్యత మహిళలదే అంటూ అక్కడే 10 మంది మహిళలు,15 మంది పురుషులతో కూడిన కమిటి ఏర్పాటు చేశారు.

Advertisement

రేపటి నుండి బెల్ట్ షాపులు మూసివేయాల్సిన బాధ్యత కమిటీలే తీసుకోవాలని చెప్పారు.

Advertisement

Latest Nalgonda News