రాబోయే రోజుల్లో మహా సంగ్రామం జరగబోతోంది..: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేసిన మోసాలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు.

 A Great Struggle Is Going To Take Place In The Coming Days..: Cm Jagan-TeluguStop.com

టీడీపీని 23 సీట్లకే పరిమితం చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.రాబోయే రోజుల్లో మహా సంగ్రామం జరగబోతోందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ప్రజలు గతంలోని చంద్రబాబు పాలన, జగన్ పాలనను బేరీజు వేసుకోవాలని సూచించారు.చంద్రబాబు పాలన అంతా మోసాలు, వెన్నుపోటేనని విమర్శించారు.

చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి స్కీం తీసుకురాలేదని మండిపడ్డారు.ఈ క్రమంలో మోసం చేసేందుకు ఓటు వేయండని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

మీ ఇంటిలో మంచి జరిగితేనే వైసీపీకి ఓటేయాలని సీఎం జగన్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube