రాబోయే రోజుల్లో మహా సంగ్రామం జరగబోతోంది..: సీఎం జగన్
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేసిన మోసాలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు.
టీడీపీని 23 సీట్లకే పరిమితం చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.
రాబోయే రోజుల్లో మహా సంగ్రామం జరగబోతోందని పేర్కొన్నారు.ఈ క్రమంలో ప్రజలు గతంలోని చంద్రబాబు పాలన, జగన్ పాలనను బేరీజు వేసుకోవాలని సూచించారు.
చంద్రబాబు పాలన అంతా మోసాలు, వెన్నుపోటేనని విమర్శించారు.చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి స్కీం తీసుకురాలేదని మండిపడ్డారు.
ఈ క్రమంలో మోసం చేసేందుకు ఓటు వేయండని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
మీ ఇంటిలో మంచి జరిగితేనే వైసీపీకి ఓటేయాలని సీఎం జగన్ కోరారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్యను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారా.. నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇదే!