విరాట్ కోహ్లి.అనుష్క శర్మ మధ్య ప్రేమాయణం అందరికి తెలిసిన విషయమే.
అయితే వీరిద్దరి మధ్య రీలేషన్ పై రోజుకో వార్త మీడియాలో చక్కెర్లు కొడుతుంది.ఇదిలా ఉంటే.
ఐసిసి వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి నిరాశే అంటున్నాయి మీడియా వర్గాలు…అసలు విషయం ఏమిటంటే.ప్రేయసి అనుష్క శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
తన చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె బిజీగా ఉంది.తన చిత్రం ఎన్హెచ్10 ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
తన షెడ్యూల్ ఆస్ట్రేలియాకు వెళ్లడానికి అనుమతిస్తుందా, లేదా అనేది తెలియడం లేదని ఆమె సన్నాయి నొక్కులు నొక్కింది.ఆస్ట్రేలియాకు వెళ్లే విషయంలో కచ్చితమైన ప్రణాళిక ఏమీ లేదని, చివరి రోజుల్లో కొద్ది సమయం వెళ్తానేనమో తెలియదని అన్నది.
అది కూడా అంత గ్యారంటీ లేదని చెప్పింది.అనుష్క దూరం కావడం విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రభావం చూపుతోందని గతంలో ఉహాగానాలు చెలరేగాయి.
అయితే, వాటిని ఆమె ఏమీ పట్టించుకున్నట్లు లేదు.తమ జీవితాల పట్ల ప్రజలకు ఉండే ఆసక్తిని తాను అర్థం చేసుకోగలనని, అయితే తమ వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించవద్దని వారిని తాను కోరుతున్నానని అనుష్క శర్మ పెద్ద ఆరిందానిలా చెప్పేసింది.
చూద్దాం మరి ఏం జరుగుతుందో.