నటుడు సతీష్ బాబు రాటకొండ దర్శకత్వం వహించి హీరోగా నటించిన తాజా చిత్రం జాతర.ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వాస్తవ సంఘటనల ఆధారంగా పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ సినిమా జాతర.ఈ సినిమాకు గల్లా మంజునాథ్ సమర్పకుడిగా రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మించింది.
ద్వారంపూడి రాధాకృష్ణారెడ్డి నిర్మాతగా, ద్వారంపూడి శివశంకర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు.మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.
కథ:
పూజారి పాలేటి ఏకైక కుమారుడు చలపతి( సతీష్ బాబు రాటకొండ) నాస్తికుడు.వెంకటలక్ష్మి( దీయ రాజ్ )అదే ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది.ఆమె చలపతి ప్రవర్తన చూసి అతనిపై ప్రేమను పెంచుకుంటుంది.ఇక చలపతి జీవితం అస్తవ్యస్తంగా సాగుతున్న సమయంలో గంగిరెడ్డి చలపతి జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు.ఒకరోజు గంగావతి గ్రామదేవతలు కలలో వచ్చి పాలేటికి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది.జరుగుతున్న విషయాలు గ్రామస్తులకు తెలుసుకుని పాలేటి కుటుంబానికి ప్రతికూల కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే చెడు అభిప్రాయాన్ని కలిగి ఉండటంతో వారిని నమ్మరు.
అంతా సవ్యంగా సాగుతున్నప్పుడల్లా, అకస్మాత్తుగా పాలేటి గ్రామం నుండి అదృశ్యమవుతుంది.ఆలయ పూజారి కారణంగా గ్రామ దేవత అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక చెడు సంకేతం ప్రతి ఒక్కరినీ మూలలో పడవేస్తుందని గ్రామంలోని ప్రజలు నమ్మడం ప్రారంభిస్తారు.
అప్పుడు గంగిరెడ్డి గ్రామ కార్యకలాపాలను చేపడుతూ ఊరి గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు.ఇక చలపతి అలాగే గంగిరెడ్డి కుటుంబాల మధ్య ఉన్న గొడవల దారుణంగా చలపతిని చంపాలని అనుకుంటాడు.మరి చివరికి చలపతిని చంపాడా? పాలేటి అదృష్యమైన విషయం చలపతికి తెలుస్తుందా? చివరికి ఏమయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు :
సతీష్ బాబు రాటకొండ ఈ చిత్రంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు.మరి ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సినిమాలో అని పాత్ర మరింత అద్భుతంగా ఉంటుంది.
సినిమాలో విలన్ తో క్లైమాక్స్ అన్ని వేషాలు ఇంకా బాగా ఉంటాయి.హీరోయిన్ కూడా బాగానే నటించింది.
అలాగే ఆర్కే నాయుడు కూడా గంగిరెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు.మిగిలిన నటీనటులు బత్తుల లక్ష్మి, రాము గల్లా, గల్లా మంజునాథ్, మహబూబ్ పాషా షేక్ తదితరులు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
డైరెక్షన్ బాగుంది.సినిమాలో బిజిఎం కూడా బాగానే ఉంది.ప్రతి ఒక సన్నివేశాన్ని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు.రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ అవుట్‌పుట్‌తో బాగున్నాయి.సినిమాలో బెస్ట్ పార్ట్ అంటే బిజిఎం అని చెప్పాలి.అలాగే సినిమా ఆటోగ్రాఫర్ కెవి ప్రసాద్ బాగానే ఆకట్టుకున్నారు.ముఖ్యంగా సినిమాలో పల్లెటూరి అందాలు దేవత సన్నివేశాలను బాగా చక్కగా ప్రదర్శించారు.
విశ్లేషణ:
ఈ సినిమా పల్లెటూరిలో ఉంటూ వాతావరణం ఎంజాయ్ చేసేవారికి బాగా వస్తుందని చెప్పాలి.సినిమాను చూసే ప్రేక్షకులను కచ్చితంగా ఇది పల్లెటూరికి తీసుకొని వెళుతుంది.ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా అందించారు.
ఈ విషయం పట్ల దర్శకుడు బాగా జాగ్రత్తలు తీసుకున్నాడు.సినిమాలలో కొన్ని కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ ని తెప్పిస్తాయి.
సినిమాలో దేవతా సన్నివేశాలు వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవల్ అని చెప్పవచ్చు.ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అన్ని వేషాలను ప్రేక్షకులు తప్పకుండా ఆనందిస్తారు.
రేటింగ్ :
3/5