రతన్ టాటాను ఇంప్రెస్ చేయడానికి సగం శాలరీ ఖర్చు చేసిన శాంతను..?

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా( Ratan Tata) మరణం మన దేశాన్ని బాగా కలచివేసింది.ఆయన దేశ ప్రజల కోసమే చాలా కష్టపడ్డారు.

 Shantanu Spent Half His Salary To Impress Ratan Tata, Ratan Tata, Shantanu Nai-TeluguStop.com

నిస్వార్థంతో ప్రపంచ ప్రజల మనసులు గెలుచుకున్నారు.అంత మంచి మనిషి కాబట్టి ఆయన చనిపోయినప్పుడు చాలామంది కన్నీరు పెట్టుకున్నారు.

రతన్ టాటా స్నేహితుడు, టాటా ట్రస్ట్స్‌ యంగెస్ట్ జనరల్ మేనేజర్ శాంతను నాయుడు బాగా ఏడ్చేసారు.అతడు రతన్ టాటా ఆప్యాయతను దగ్గరగా చూశారు.

రతన్ మరణం తర్వాత, శాంతను తన మనోవేదనను వ్యక్తపరుస్తూ, తన గురువు వదిలిపోయిన ఖాళీని తన జీవితమంతా నింపడానికి ప్రయత్నిస్తానని రాశారు.ఆయన, “ప్రేమకు ధర విషాదం” అని కూడా రాశారు.

Telugu Brooks Brothers, Farewell, Industrialist, Kindness, Lighthouse, Ratan Tat

2021లో, శాంతను( Shantanu Naidu ) “ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్: ఎ షార్ట్ మెమోయర్ ఆఫ్ లైఫ్ విత్ రటన్ టాటా” అనే ఆత్మకథను రచించారు.ఈ పుస్తకంలో, తాను పూణేలో ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్నప్పుడు టాటాను ఎలా కలిశానో వివరించారు.వీరిద్దరికీ కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ స్నేహం బాగా పెరిగింది.శాంతను, టాటాకి ఒక లేఖ రాసి ఆయన్ని మొదటిసారి కలిశాడని చెప్పారు

Telugu Brooks Brothers, Farewell, Industrialist, Kindness, Lighthouse, Ratan Tat

శాంతను అమెరికా( America)లోని కార్నెల్ యూనివర్సిటీలో ఎం.ఏ.చేయడానికి పోవాల్సి వచ్చినప్పుడు రతన్ టాటా వదిలి వెళ్లాల్సి వచ్చింది.దీనికంటే ముందు ఒక ఫేర్వెల్ డిన్నర్ ప్లాన్ చేశారు.శాంతను ఆ పార్టీలో తాను బాగా కనిపించాలని బ్రూక్స్ బ్రదర్స్ అనే బ్రాండ్ షర్ట్ కొన్నారు.రతన్ ఎప్పుడూ బ్రూక్స్ బ్రదర్స్ బ్రాండ్ షర్టులు వేస్తూ ఉంటారని శాంతను గమనించారు.అందుకే ఆయన కూడా అదే బ్రాండ్ షర్టు కొన్నారు.

ఆ షర్టు ధర చాలా ఎక్కువ.అది కొనడానికి ఆయన ఒక నెల జీతంలో సగం ఖర్చు చేశారు.

కానీ ఆ రోజ ఆ షర్టు ఈ యువకుడికి సరిగా సెట్ అవ్వలేదు.కొన్ని రోజుల తర్వాత, శాంతను షర్టు చిరిగిపోయిందని టాటాకి తెలిసింది.

అప్పుడు టాటా అమెరికాలో ఒక దుకాణంలో అదే షర్టును కనుగొన్నారు.ఆయన ఆ షర్టును శాంతనుకు కొని ఇచ్చారు.

శాంతను తీసుకోవడానికి ఇష్టపడకపోయినా, టాటా, “నా స్నేహితుడికి ఒక షర్టు ఇవ్వకూడదా?” అని చాలా ప్రేమగా అడిగారు.అప్పుడు అతను కాదనలేక ఆ షర్ట్ తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube