ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ జెమినీ ఏఐ!

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రంగంలో దూసుకుపోతున్న సంగతి అందరికీ.జెమినీ లైవ్( Gemini Live ) పేరుతో గూగుల్( Google ) ప్రవేశపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ కు పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించడం విశేషం.

 Google Gemini Ai Now Available In 9 Indian Languages Details, Google, Gemini Ai,-TeluguStop.com

ఇప్పటివరకు కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న జెమినీ లైవ్ ఇక నుంచి దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు.

Telugu Gemini Ai, Geminiai, Gemini Live Ai, Google, Google India, Google Maps, G

ఈ క్రమంలో తాజాగా గూగుల్ నిర్వహించిన ‘గూగుల్ ఫర్ ఇండియా’( Google For India ) ఈవెంట్ పదవ ఎడిషన్ భాగంగా అన్ని ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలతో పాటు మరికొన్ని కీలక అప్డేట్లను ప్రకటించింది.ప్రస్తుతానికి ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు గురువారం నుంచి మొత్తం 9 ప్రాంతీయ భాషలలో అందుబాటు వచ్చినట్లు తెలిపింది.అంతేకాకుండా దాదాపు 40 శాతం మంది జెమినీ ఏఐ ని ప్రస్తుతానికి వాయిస్ ఇన్పుట్ ద్వారానే వినియోగిస్తున్నారని తెలియజేసింది.

Telugu Gemini Ai, Geminiai, Gemini Live Ai, Google, Google India, Google Maps, G

ఈవెంట్ లో భాగంగా గూగుల్ మరికొన్ని కీలక ప్రకటనలు చేస్తూ గూగుల్ మ్యాప్స్ లో( Google Maps ) కొత్తగా ఒక రెండు రియల్ టైం వాతావరణ అప్డేట్లను జోడించినట్లు తెలిపింది.దీనితో మంచు కురిసిన సమయంలో వరదలు సంభవించే సమయంలో ఈ కీలక అప్డేట్లు వాహనదారులకు ఉపయోగపడతాయని పేర్కొంది.అలాగే గూగుల్ పే లో( Google Pay ) యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.దీంతో యూసర్లు తమ యుపిఐ అకౌంట్ ను ఇతరులతో చాలా సులువుగా షేర్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా గూగుల్ పే ద్వారా దాదాపు 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం కూడా కల్పించారు.కేవలం పర్సనల్ లోన్ కాకుండా గోల్డ్ లోన్ కూడా తీసుకునే అవకాశం కూడా కల్పించింది .గూగుల్ మ్యాప్స్ లోని 170 మిలియన్ల ఫేక్ రివ్యూలను ఏఐ సహాయంతో తొలగించినట్లు గూగుల్ సంస్థ వారు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube