వరదల్లో బురద రాజకీయం : చంద్రబాబు కి జగన్ ఎనిమిది ప్రశ్నలు

ఏపీలో వరదలు చుట్టుముట్టి ప్రజలను అష్ట కష్టాలకు  గురిచేశాయి.ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం చెందుతున్నారు.

 Mud Politics In Floods Jagan Eight Questions To Chandrababu, Ap Government, Ysrc-TeluguStop.com

ముఖ్యంగా విజయవాడ లో సంభవించిన వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.ఎంతోమంది చనిపోగా,  భారీగా ఆస్తి నష్టం జరిగింది.

అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి బాధితులకు అండగా నిలుస్తున్నాయి.ఇక ప్రభుత్వంతో పాటు,  మిగతా పార్టీలు తమకు తోచిన విధంగా సహాయక చర్యలలో పాల్గొంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ , వరదల్లోనూ బురద రాజకీయం చేస్తున్నారనే విమర్శలపాలు అవుతున్నారు.

అసలు విజయవాడలో భారీ వరదలకు సంబంధించి ఈ స్థాయిలో నష్టం జరగడానికి ఏపీ ప్రభుత్వ వైఫల్యం కారణమని వైసిపి విమర్శలు చేస్తుండగా, అసలు ఇదంతా జరగడానికి గత వైసిపి ప్రభుత్వమే కారణమని టిడిపి, జనసేన , బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.తాజాగా మరోసారి విజయవాడ వరదలు వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు .విజయవాడలో వరద వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా.  బాధితులకు అందుతున్న సాయం అరకొర గా ఉందని జగన్ విమర్శించారు.

ప్రభుత్వం చేతకాని స్థితిలో ఉందని,  ఇంతటి అమానీయత చంద్రబాబుకే సాధ్యం అంటూ జగన్ విమర్శలు చేస్తూ,  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు .ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎనిమిది  ప్రశ్నలు సంధించారు.

1.చంద్రబాబు( Chandrababu ) గారు విజయవాడలో వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది.ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి.అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తుంది.వరదలు కన్నా మీ నిర్వాహకాల వల్ల నెలకొన్న విషాదం మీ అసమర్ధత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది.ఐదు కోట్ల మంది జనాభా,  లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదు,  ఆరు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా ?  ఇంత చేతకానితనమా ? ఇంతటి అమానీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారు.

2.మూడు రోజుల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం పడ్డం అసాధారణం ఏమీ కాదు.గతంలో చాలాసార్లు పడింది.కానీ ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు.బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం,  ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా.  అవి ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడం , బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అన్నది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.

ఈ వరదలు వచ్చి ఎనిమిది రోజులు అవుతున్నా నాలుగు, ఐదు రోజులుగా వర్షాలు లేకుండా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం.

Telugu Ap, Jagan, Jaganangry, Mudfloods, Ysrcp-Politics

3.అసలు ఇదంతా ఎందుకు జరిగింది ?  దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారు ? శుక్రవారం నుంచి భారీ వర్షాలు వస్తాయని భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజు (ఆగస్టు 28 ) అలర్ట్ వచ్చిన అప్పటికే కృష్ణ నదిపై ఉన్న జలాశయాలన్ని పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, మీరు పట్టించుకోలేదు.ఇరిగేషన్,  రెవెన్యూ,  హోం సెక్రటరీలతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశా నిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా.

4.ఆ రివ్యూ జరిగి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ ప్లడ్ కుషన్ ( Irrigation Secretary Blood Cushion )మీద ధ్యాస పెట్టేవారు కదా.  కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం,  నాగార్జునసాగర్ పులిచింతల నుంచి కొద్దికొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి తగ్గించుకుంటూ వస్తూ 60,  70 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటుచేసి ఉండేవారు కదా.అప్పుడు పైనుంచి వచ్చే వరద నీటిని ఆయా జలశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే పులిచింతల కింద కృష్ణా నదిలోకి వచ్చే వరద నీరు సక్రమంగా నియంత్రించి, భారీ వరద ముప్పును తప్పించేవారు.  దీనివల్ల ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా.  పైనుంచి వచ్చిన వరదల తగ్గించకపోవడం వల్ల కృష్ణా నదిలో భారీ ప్రవాహానికి పులిచింతల వరద కూడా తోడైంది.దీంతో పాటు, బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసింది.

Telugu Ap, Jagan, Jaganangry, Mudfloods, Ysrcp-Politics

5.రెవెన్యూ సెక్రటరీ షెల్టర్ ఏర్పాటు నిరాశ్రయులకు వసతుల కల్పనపై దృష్టి పెట్టేవారు హోం సెక్రటరీ.లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్ లోకి షిఫ్ట్ చేసి ఉండేవారు.వీరంతా సిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్లు,  స్పెషల్ ఆఫీసర్లు,  గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది,  వాలంటీర్లు ( Volunteers )ఉండి ఉంటే వారితో కలిసి ఈ ముప్పును చాలా సమర్థవంతంగా ప్రాణా నష్టం లేకుండా ఎదుర్కొనేవారు   కానీ ఇవేమీ జరగలేదు.

6.మీ ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయం లోపం నెలకొంది.మీకు మీ కూటమి మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణ పై వైరల్ పైన వీడియోనే దీనికి సాక్ష్యం.

ట్రాక్టర్లు రాకపోవడం ఏమిటి ?  150 వాహనాలు మాత్రమే ఉండడం ఏమిటి ? 80 వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలిరోజే 15వేల మందికి ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే వివక్ష చూపడం ఏమిటి? వర్షాలు ఆగి ఐదు రోజులైన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు ? లక్షల ఉద్యోగాలు ఉన్న యంత్రాంగం ఏమైపోయింది ? ఇప్పటికీ ఇంటింటికి జల్లెడపెట్టి ఎన్యుమరేషన్ చేసిన దాఖలాలేవి కనిపించడం లేదు.  మరి మీరు ఇచ్చిన సహాయం కచ్చితంగా వారికి ఎలా చేరుతుంది  ? ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతారు ? విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన గ్రామ,  వార్డు సచివాలయాలు,  వాలంటరీ వ్యవస్థపై కక్ష పెంచుకొని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వాస్తవం కాదా .

7.బాధితులకు బియ్యం,  పప్పు , నూనె( Rice, pulses, oil ) తదితర సరుకులు ఇవ్వడం ఏపీలో ఇదే తొలిసారి అన్నట్లుగా దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది .వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వరదలు వల్ల బాధితులైన వారికే కాదు వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్ సరుకులను ఒక్కరోజులో ఎండియు వాహనాల్లో డోర్ డెలివరీ చేసాం అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశాం కానీ విజయవాడలో పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా మీరు ఇస్తున్న సరుకులు ఆరో తేరా అవి కూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేరడం లేదు తీసుకున్న ఆ కొద్దిమంది కీళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఇది ఇంకా వారిని బాధ పెట్టడం కాదా.

8.కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఒకరు,  వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయి మరొకరు ఉపాధిని కోల్పోయి ఇంకొకరు ఇల్లు కోల్పోయి మరొకరు ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కలిసినా ఇలాంటి దీనగాదలే వినిపిస్తున్నాయి.వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబు గారు ? ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో బీద అరుపులు ఎందుకు ? చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రా అక్క చెల్లమ్మల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏమిటి ? బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి.మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున కచ్చితంగా పోరాటం చేస్తాం ”

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube