నిద్రలేమితో వర్రీ వద్దు.. నిత్యం నైట్ వీటిని తింటే నిద్ర తన్నుకొస్తుంది!

మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ఆహారం, శరీరానికి శ్రమ ఎంత అవసరమో కంటికి నిద్ర( Eye sleep ) కూడా అంతే అవసరం.కంటినిండా నిద్ర లేకపోతే మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోతాడు.

 If You Eat Pistachios Daily, You Will Get Rid Of Insomnia! Insomnia, Pistachio,-TeluguStop.com

అందుకే రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రించాలని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.అయితే ఇటీవల కాలంలో ఎంతో మందికి నిద్రలేమి అనేది అతిపెద్ద శత్రువుగా మారుతోంది.

జీవన శైలి, స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర అంశాల కారణంగా నిద్రలేమికి గురవుతున్నారు.

మొదట్లో ఇది చిన్న సమస్యగానే అనిపించినా.

క్రమక్రమంగా దాని తీవ్రత ఏంటో అర్థం అవుతుంది.అందుకే ఆరంభంలోనే నిద్రలేమిని వదిలించుకోవాలి.

అందుకు కొన్ని కొన్ని ఆహారాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఈ జాబితాలో పిస్తా పప్పు కూడా ఒకటి.

పిస్తా పప్పు( pista nut ) ఖరీదు ఎక్కువే అయినప్పటికీ అది అందించే ప్రయోజనాలు మాత్రం అంతులేని విధంగా ఉంటాయి.పిస్తా పప్పులో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బి6, విటమిన్ కె, బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్‌ త‌దితర పోషకాలు మెండుగా ఉంటాయి.

Telugu Sleep, Tips, Eat Pistachios, Latest, Pistachio, Ridinsomnia-Telugu Health

అందువల్ల ఆరోగ్యపరంగా పిస్తా పప్పు చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా నిద్రలేమి సమస్యను( Insomnia problem ) వదిలించడానికి ఉత్త‌మంగా తోడ్పడుతుంది.ప్రతిరోజు పడుకోవడానికి అరగంట ముందు ఐదు నుంచి ఆరు పిస్తా పప్పులను తీసుకుని తినండి.పిస్తా పప్పులో మెలటోనిన్ ఉంటుంది.ఇది నిద్ర పట్టడానికి తోడ్పడే హార్మోన్.మెదడులోని పీయూష గ్రంధి( Piyush gland ) నుంచి ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.

దీని మోతాదుల‌ బట్టి మన నిద్ర మెలకువలను నియంత్రించే జీవగడియారం ఆధారపడి ఉంటుంది.

Telugu Sleep, Tips, Eat Pistachios, Latest, Pistachio, Ridinsomnia-Telugu Health

సూర్యాస్తమయం తర్వాత ఒంట్లో మెలటోనిన్ మోతాదులు పెరగడం స్టార్ట్ అవుతాయి.అయితే నిద్రలేమి బారిన పడ్డవారికి ఈ మెలటోనిన్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదు.దాంతో ఎంత ప్రయత్నించినా నిద్రపోలేరు.

అలాంటి వారికి పిస్తా పప్పు ఒక న్యాచురల్ మెడిసిన్ మాదిరి పనిచేస్తుంది.నిత్యం నైట్ ప్పిస్తా పప్పు తీసుకుంటే అందులో ఉండే మెలటోనిన్ హార్మోన్‌ నిద్రలేమిని దూరం చేస్తుంది.

నిద్ర తన్నుకొచ్చేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి నిద్రలేమితో బాధపడే వారు, సరిగ్గా నిద్ర పట్టడం లేదని సతమతమయ్యేవారు పిస్తా పప్పును డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube