రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.దేశవ్యాప్తంగా ఈసారి ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) నాలుగో దశలో మే 13వ తారీకు పోలింగ్ జరిగింది.ఈసారి ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది.
ఏకంగా 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదు కావటం సంచలనంగా మారింది.ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన గాని ప్రధానంగా వైసీపీ…టీడీపీ కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది.
జూన్ ఒకటవ తారీకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో( Exit Polls ) అత్యధిక శాతం ఈ రెండు పార్టీలలో ఒకటి అధికారంలోకి రాబోతున్నట్లు ఫలితాలు వచ్చాయి.
పరిస్థితి ఇలా ఉండగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణనంద స్వామి( Paripoornananda Swamy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి జగన్ ముఖ్యమంత్రి( CM Jagan ) కాబోతున్నారని పేర్కొన్నారు.అసెంబ్లీ ఫలితాలలో 123 స్థానాలు వైసీపీకి వస్తాయని జోష్యం చెప్పారు.
గ్రామీణ మహిళలు అధిక శాతం వైసీపీకే( YCP ) ఓట్లు వేశారని స్పష్టం చేశారు.అలాగే దేశంలో ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.
మూడోసారి మోడీ ప్రధాని అవుతారని అన్నారు.కాగా ఏపీ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి పోటీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఏపీలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పరిపూర్ణానంద కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.