తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ( Devotees ) ఎదురు చూస్తూ ఉంటారు.దూరం,అలాగే సమయాన్ని కూడా లెక్కచేయకుండా స్వామివారి దర్శనం కోసం కొండమీదకు చేరుకుంటూ ఉంటారు.
అయితే స్వామివారిని చూసేందుకు క్షణకాలం మాత్రమే అవకాశం ఉంటుంది.భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.
కాబట్టి శ్రీవారిని ఎక్కువసేపు చూసేందుకు వీలు ఉండదు.అయితే క్షణకాలమే చూసిన భక్తులు తరించిపోతుంటారు.
అలాంటి వారికి ఇది ఒక శుభవార్తతే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి వారిన దగ్గర్నుంచి చూడాలని అందరికీ ఉంటుంది.కానీ వీఐపీ దర్శనం( VIP Darshan ) చేసుకునే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది.అయితే ఇక మీదట సామాన్య భక్తులకు కూడా ఈ అవకాశం లభించనుంది.
సామాన్య భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం కల్పించడంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి( TTD EO AV Dharma Reddy ) వెల్లడించారు.టిటిడి పరిపాలన భవనంలో డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం ను శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తుల నుంచి సలహాలు, సూచనలు ఈవో తీసుకున్నారు.
అలాగే భక్తులు అడిగినా చాలా ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.తిరుమలలో ఉన్న పలు సమస్యలను భక్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.ఇన్నాళ్లు ఆర్జిత సేవల్ని లక్కీ డిప్ ద్వారా టిడిపి అందిస్తూ వచ్చిందని ఆయన వెల్లడించారు.
ఇక మీదట వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా లక్కీ టిప్ ద్వారా అందించాలని భక్తులు కోరారని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.దీని మీద చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
LATEST NEWS - TELUGU