యూఎస్‌ సీడీసీలో భారత సంతతి వైద్యుడికి కీలక పదవి.. ఎవరీ నీరవ్ డీ షా..?

రెండేళ్ల నాడు అమెరికాను కుదిపేసిన కోవిడ్ మహమ్మారి సమయంలో కీలక సేవలు అందించిన భారత సంతతి వైద్యుడు నీరవ్ డీ షాకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ)లో ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.ప్రస్తుతం మైనే సీడీసీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన మార్చిలో బాధ్యతలు స్వీకరించనున్నారు.సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ‌కి ఆయన రిపోర్ట్ చేయనున్నారు.2019 నుంచి నీరవ్ షా మైనేకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

 Indian-american Doctor Nirav D. Shah Named Second-in-command At Us Cdc , Nirav D-TeluguStop.com

భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన నీరవ్ షా.విస్కాన్షిన్‌లో పెరిగాడు.లూయిస్‌విల్లే యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రం, జీవశాస్త్రంలో ఆయన పట్టా పొందారు.అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్రం చదువుకున్నారు.2000లో చికాగో యూనివర్సిటీ సైన్స్ స్కూల్‌లో చేరారు.2007లో జ్యూరిస్ డాక్టర్, 2008లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్‌ను పూర్తి చేశారు.

Telugu Indian American, Joe Biden, Nirav Shah, Kansas, Cdc, Usha Reddy-Telugu NR

ఇదిలావుండగా.గత మంగళవారం కనీసం అర డజను మంది భారతీయ అమెరికన్‌లను కీలక పరిపాలనా స్థానాలకు అధ్యక్షుడు బైడెన్ తిరిగి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే వీటికి సెనేట్ ఆమోదం లభించాల్సి వుంది.తిరిగి నామినేట్ చేసిన వారిలో రిచర్డ్ వర్మ (డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్), డాక్టర్ వివేక్ హల్లెగెరె మూర్తి (ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రతినిధి), అంజలి చతుర్వేది (జనరల్ కౌన్సెల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్న్ అఫైర్స్), రవి చౌదరి (ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ), గీతా రావు గుప్తా ( గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూ రాయబారి), రాధా అయ్యంగార్ ప్లంబ్ (డిఫెన్స్ అండర్ సెక్రటరీ)వున్నారు.

Telugu Indian American, Joe Biden, Nirav Shah, Kansas, Cdc, Usha Reddy-Telugu NR

ఇకపోతే.రెండ్రోజుల క్రితం తెలుగు మూలాలున్న డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఉషారెడ్డి కాన్సాస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టారు.గత నెలలో శాసనసభ నుంచి పదవీ విరమణ చేసిన మాన్‌హట్టన్ సెనేటర్ టామ్ హాక్ స్థానంలో ఉషారెడ్డి నియమితులయ్యారు.

దీనిపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

డిస్ట్రిక్ట్ 22కి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు తనకు థ్రిల్‌గా వుందని.ఇప్పటి వరకు ఈ పదవిలో వున్న సెనేటర్ హాక్ ప్రజా సేవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఆయన అత్యుత్తమ నాయకుడని, అతని స్థాయికి చేరుకుంటానని ఆమె పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube