ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్...రూ. 550 చెల్లిస్తే...

భారత్ నుంచీ ఎంతో మంది వలస వాసులు వివిధ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.కొందరు అత్యున్నతమైన రంగాలలో పనిచేసేందుకు, ఉన్నత చదువుల కోసం వలసలు వెళ్ళగా అత్యధిక శాతం వలస వాసులు కార్మికులుగా పనిచేసేందుకు వలస వెళ్తుంటారు.

 Ap Government Good News For Expatriates Rs. If You Pay 550  , Ap Government, Kuw-TeluguStop.com

అయితే పొట్ట చేత బట్టుకుని కార్మికులుగా కువైట్, దుబాయ్ వెళ్లి అక్కడ చాకిరీ చేస్తూ ప్రమాదవశాత్తు వారికి ఎలాంటి అనారోగ్య పరిస్తితులు ఎదురయినా అప్పటి వరకూ సంపాదించిన జీతం మొత్తం ఆసుపత్రులకు సరిపోతుంది, ఒక వేళ వ్యక్తి మరణిస్తే ఆ వలస వాసుడి కుటుంభం రోడ్డున పడాల్సిందే.

ఇలాంటి పరిస్థితులలో కొందరు వలస వాసులు తమకు భీమా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా వారి ఆర్ధిక పరిస్థితుల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది వలస వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ఈ పరిస్థితులను సమీక్షించిన ఏపీ ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు భీమ సౌకర్యం ఏర్పాటు చేయాలని భావించాయి.

ఈ మేరకు ఏపీ నుంచీ వివిధ దేశాలకు వలసలు వెళ్ళే ప్రవాసుల సంక్షేమం కోసం శ్రమించే APNRT కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రవాసాంధ్రులు ఎవరైనా సరే ఏడాదికి రూ.550 చెల్లిస్తే రూ.10 లక్షల భీమాను భోరోసా గా ఇస్తామని APNRT అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ప్రకటించారు.అంతేకాదు రూ.550 ను మూడేళ్ళ పాటు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.ఏపీ నుంచీ విదేశాలకు వలసలు వెళ్ళిన వారు దాదాపు 20 లక్షల పైనే ఉన్నారని, వీరందరూ ఈ భీమాను ఉపయోగించుకోవచ్చునని ప్రకటించారు.ఇది కేవలం ప్రవాసాంధ్రులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు.ఇదిలాఉంటే గడిచిన రెండేళ్ళలో సుమారు 1.5 కోట్ల మీద ప్రమాద భీమా డబ్బులు మరణించిన కుటుంబాలకు అందించామని ఆయన తెలిపారు.ప్రవాసులు ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి సమస్య వచ్చినా సరే 8632340678, 8500027678 టోల్ ఫ్రీ నెంబర్ లకు కాల్ చేయవచ్చునని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube