సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రపంచంలోని ఏ మూల ఆసక్తికర సంఘటనలు జరిగినా మనకు తెలుస్తోంది.వందల, వేల కిలో మీటర్ల అవతల, వివిధ దేశాల్లో జరిగిన ఘటనలను మనం క్షణాల్లో ఫోన్లలో వీక్షిస్తున్నాం.
ఇందులో కొన్ని వీడియోలను లేదా వార్తలు చూసినప్పుడు కొన్ని కవ్విస్తాయి.మరికొన్ని నవ్విస్తాయి.
ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి.అయితే కొందరి ప్రతిభకు సంబంధించిన వీడియోలను చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేం.
ఇలాగే మన భారతీయుడి ప్రతిభకు విదేశీయులు సైతం ఆశ్చర్యపోతున్నారు.అతడి పనితీరును మెచ్చుకుంటూ, మన దేశ ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సాధారణంగా కూరగాయలు కట్ చేయాలంటే ఎంత నైపుణ్యమున్నా సరే కొన్నింటి విషయంలో ఇబ్బందిగా ఉంటుంది.
ముఖ్యంగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేయాలంటే వంటింట్లో ఆడవారు ఎంతో ఇబ్బంది పడతారు.అదే క్యాబేజీని ఇంటికి తీసుకు వచ్చి, కిందన ఉండే దాని ఆకులు, కాండాన్ని కట్ చేయాలంటే కత్తి పీటకు పదును ఉండాల్సిందే.
ఎంత పదును ఉన్నా దానిని కోయడానికి కొంత సమయం పడుతుంది.అయితే ఓ వీడియోలో మన భారతీయుడు మాత్రం క్షణాల్లో చకచకా క్యాబేజీలను కోసేస్తున్నాడు.చూస్తుండగానే, కొన్ని సెకన్ల వ్యవధిలో బస్తా క్యాబేజీలను కోసేశాడు.అతడి పనితీరును చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇది నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.మన దేశస్తులతో పాటు విదేశీయులు కూడా ఈ వీడియో పట్ల మక్కువ చూపుతున్నారు.
నార్వే దేశానికి చెందిన ఎరిక్ సోల్హీమ్ అనే పొలిటీషియన్ మన భారతీయుడి వీడియోను స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.భారత దేశానికి రొబోటిక్ ఆటోమేషన్ వ్యవస్థ అవసరం లేదని, అందుకు ఈ యువకుడి ప్రతిభే నిదర్శమని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
ఇప్పటికే ఆ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.పలువురు నెటిజన్లు ఆ యువకుడి ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.