అక్క జైలు జీవితం తనని స్ట్రాంగ్ చేసింది అంటున్న నిక్కి గల్రాని

కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల భామ నిక్కి గల్రాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుజ్జిగాడు సినిమాలో నటించిన కన్నడ భామ సంజనా గల్రాని చెల్లిగా ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

 Nikki Galrani Open Up On Her Sister Arrested, Tollywood, Bangalore, Sanjana Galr-TeluguStop.com

సంజనా గల్రాని మాతృభాష కన్నడలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.అయితే కోలీవుడ్, టాలీవుడ్ లో మాత్రం పెద్దగా రాణించలేదు.

అయితే చెల్లి మాత్రం మాతృభాషలోనే హీరోయిన్ గా పరిచయం అయినా తర్వాత కోలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకొని వరుస అవకాశాలతో రాణిస్తుంది.తెలుగులో మాత్రం ఓ మూడు సినిమాలలో నిక్కి కనిపించింది.

ఇక్కడ పెద్దగా ఆమెకి అవకాశాలు రాలేదు.ప్రస్తుతం కూడా తమిళ్ లో ఓ మూడు సినిమాల వరకు ఆమె చేతిలో ఉన్నాయి.

అందులో ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కూడా ఉండటం విశేషం.హీరో ఆదితో నిక్కి పీకల్లోతు ప్రేమలో ఉందనే టాక్ కోలీవుడ్ లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.

అందుకు తగ్గట్లే ఆమె కూడా చెన్నైకి తన మకాం మార్చేసి అక్కడే ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన అక్క సంజనా గల్రాని అరెస్ట్ పై స్పందించింది.

అక్కడ జైలుకి కాస్త ఆలస్యంగానైనా నిజమే గెలుస్తుంది.అక్క జైలు పాలవ్వడంతో తమ కుటుంబం మరింత స్ట్రాంగ్ అయిందని నిక్కి చెప్పుకొచ్చింది.

అక్క బెంగళూరులో ఉంటుంది.నేను ఎక్కువగా చెన్నైలోనే ఉంటాను.

గతేడాది లాక్ డౌన్ టైమ్ లో నేను చెన్నైలోనే ఉన్నాను.ఇప్పుడు కూడా చెన్నైలోనే ఉన్నాను.

అందుకే అక్క కేసు బయటకొచ్చినప్పుడు నేను మీడియాకు అందుబాటులోకి రాలేకపోయాను.అయితే ఆ కేసు నుంచి కోలుకునే క్రమంలో మా బంధం మరింత దృఢమైంది.

మా ఫ్యామిలీ ఇంకాస్త స్ట్రాంగ్ అయింది.కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికికొకరం తోడుగా నిలబడి తమ బంధాన్ని మరింత బలంగా చేసుకున్నామని నిక్కి చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube