పిల్లలకు తమిళ భాషని పరిచయం చేయండి : సింగపూర్‌ భారత సంతతి మంత్రి పిలుపు

సింగపూర్‌లో( Singapore ) భారత సంతతికి చెందిన మంత్రి ఇంద్రాణి రాజా( Indranee Rajah ) మాతృభాషగా తమిళం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.సింగపూర్‌లోని నాలుగు అధికారిక భాషలలో ఒకదానిని పిల్లలకు పరిచయం చేయాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.

 Indian-origin Singaporean Minister Indranee Rajah Emphasises Importance Of Intro-TeluguStop.com

సింగపూర్ తన విద్యా విధానంలో హిందీ, ఉర్దూ, పంజాబీ ఇతర ప్రధాన భారతీయ భాషలతో పాటు తమిళం, మలయ్, చైనీస్‌ను పాఠశాలల్లో రెండవ భాషగా ప్రోత్సహిస్తోంది.ఇంద్రాణి రాజా మాట్లాడుతూ.

మన పిల్లలకు తమిళ భాషపై నిరంతరం పరిచయ కార్యక్రమాలు వుండేలా చూసుకోవాలన్నారు.తమిళ ప్రజలందరినీ కలిపే పాస్‌పోర్ట్‌గా తమిళ భాష( Tamil Language ) పనిచేస్తుందని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు.

Telugu Indian Origin, Indranee Rajah, Singapore, Singapore Nri, Singaporean, Tam

భాషను సజీవ పాఠంగా నేర్చుకోవాల్సి వుంటుందని, అది కేవలం చదువుకునేది కాదని .దానిని వాడుకలోనికి తీసుకురావాలని రాజా అన్నారు.టెలివిజన్, సోషల్ మీడియా లేదా ప్రింట్ అయినా .వారు చిన్నప్పటి నుంచి భాషను వింటూ ఉపయోగిస్తున్నంత కాలం దానిని మనం సజీవంగా వుంచగలమని ఇంద్రాణి రాజా పేర్కొన్నారు.సింగపూర్‌లో తమిళ భాష గొప్పతనాన్ని నిలబెట్టడానికి తమిళ భాషా మండలి (టీఎల్‌సీ)( Tamil Language Council ) గత 18 సంవత్సరాలుగా తమిళ భాషా ఉత్సవాన్ని (టీఎల్ఎఫ్) నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా ఈ ఏడాది టీఎల్ఎఫ్‌ను ఇంద్రాణి రాజా శనివారం ప్రారంభించారు.ప్రతి తరం వారి మాతృభాషతో అనుసంధానించబడి వుండటానికి , క్రమంగా వారి వారసత్వం, సాంస్కృతిక గుర్తింపు ముఖ్యమన్నారు.“Capabilities” అనే థీమ్‌పై కేంద్రీకృతమైన టీఎల్‌సీ ఈ ఏడాది మార్చి 30 నుంచి ఏప్రిల్ 28 వరకు 47 కార్యక్రమాలను నిర్వహించనుంది.

Telugu Indian Origin, Indranee Rajah, Singapore, Singapore Nri, Singaporean, Tam

సామూహిక బలాన్ని ఉపయోగించుకుంటూ వినూత్న కార్యక్రమాలను రూపొందించడానికి ఈ ఏడాది థీమ్‌ను ఎంచుకున్నారని టీఎల్‌సీ ఛైర్‌పర్సన్ ఎస్ మనోగరన్( TLC Chairperson S Manogaran ) తెలిపారు.కళ, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాల ద్వారా యువతలో తమిళ భాష నిమగ్నతను పెంచాలన్నది తమ లక్ష్యమన్నారు.నేడు మన యువతలో చాలా మంది తమిళం నేర్చుకోవడంలో , ఉపయోగించడంలో కొత్త ప్రయోజనాన్ని కనుగొంటున్నారని, ఎన్నో కార్యక్రమాలు వారిని లక్ష్యంగా చేసుకున్నాయని మనోగరన్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube