నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా కావలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ( cm jagan )మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కావలిలో ఉవ్వెత్తిన ఎగిసే కడలిని మించిన జన ప్రభంజనం కనిపిస్తోందని చెప్పారు.కావలిలో ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారన్న సీఎం జగన్ వచ్చే నెల 13న జరిగే సంగ్రామంలో వైసీపీకి ( YCP ) మద్దతు ఇవ్వాలని చెప్పారు.
ఈ ఎన్నికల్లో మన పార్టీకి మద్ధతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు మరియు రైతులు బాగుపడతారని తెలిపారు.అలాగే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావన్నారు.
జగన్, చంద్రబాబుకు( Jagan , Chandrababu ) మధ్య జరిగే ఎన్నికలు కాదన్న ఆయన మోసం చేస్తున్న చంద్రబాబు, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు.రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ బీజేపీ అన్న సీఎం జగన్ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
ప్రజలతో చంద్రబాబుది అతకని బంధమన్న సీఎం జగన్ రాష్ట్రానికి మోసం చేసిన పక్షం చంద్రబాబు పక్షమని విమర్శించారు.అయితే ఈ యుద్ధంలో తానేప్పుడూ పేదల పక్షమేనని స్పష్టం చేశారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, జగన్ చేసినదాంట్లో పది శాతమైనా చేశారా అని ప్రశ్నించారు.