గతేడాది థియేటర్లలో విడుదలై డీసెంట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హాయ్ నాన్న( Hi Nanna ) ఒకటి.శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో హాయ్ నాన్న మూవీ 10 రోజుల క్రితం ప్రసారం కాగా ఈ సినిమాకు కేవలం 4.45 రేటింగ్ వచ్చింది.సాధారణంగా నాని సినిమాలు అంటే బుల్లితెర రేటింగ్స్ విషయంలో అదరగొడతాయి.హాయ్ నాన్న మూవీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడం గమనార్హం.నాని, మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) జంటగా నటించిన ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.సినిమాలో ఉన్న ట్విస్టులు చిన్నచిన్న ట్విస్టులే అయినా ఆ ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
నాని( Nani ) హాయ్ నాన్న సినిమాకు తక్కువ రేటింగ్ రావడానికి రీజన్స్ అర్థం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.హాయ్ నాన్న మూవీ ఫుల్ రన్ లో భారీగా కలెక్షన్లు సాధించి ఓటీటీలో సైతం హిట్ గా నిలిచింది.ఓటీటీలో సైతం ఈ సినిమా ఆకట్టుకుంది.జెమిని ఛానల్( Gemini Channel ) ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లోనే చేసింది.అయితే ఎక్కడ ఈ సినిమా మిస్ ఫైర్ అయిందో అర్థం కావడం లేదు.హాయ్ నాన్న తరహా సినిమాలు మరిన్ని రావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
హాయ్ నాన్న సినిమాకు సెకండ్ టెలీకాస్ట్ లో మంచి రేటింగ్స్( Hi Nanna TRP Rating ) వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమా మళ్లీ బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాల్సి ఉంది.గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.నాని భవిష్యత్తు సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.