థియేటర్లలో హిట్ బుల్లితెరపై డిజాస్టర్ .. హాయ్ నాన్న టీఆర్పీ రేటింగ్ ఇంత తక్కువా?

గతేడాది థియేటర్లలో విడుదలై డీసెంట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హాయ్ నాన్న( Hi Nanna ) ఒకటి.

శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో హాయ్ నాన్న మూవీ 10 రోజుల క్రితం ప్రసారం కాగా ఈ సినిమాకు కేవలం 4.

45 రేటింగ్ వచ్చింది.సాధారణంగా నాని సినిమాలు అంటే బుల్లితెర రేటింగ్స్ విషయంలో అదరగొడతాయి.

హాయ్ నాన్న మూవీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడం గమనార్హం.నాని, మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) జంటగా నటించిన ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమాలో ఉన్న ట్విస్టులు చిన్నచిన్న ట్విస్టులే అయినా ఆ ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

"""/"/ నాని( Nani ) హాయ్ నాన్న సినిమాకు తక్కువ రేటింగ్ రావడానికి రీజన్స్ అర్థం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.

హాయ్ నాన్న మూవీ ఫుల్ రన్ లో భారీగా కలెక్షన్లు సాధించి ఓటీటీలో సైతం హిట్ గా నిలిచింది.

ఓటీటీలో సైతం ఈ సినిమా ఆకట్టుకుంది.జెమిని ఛానల్( Gemini Channel ) ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లోనే చేసింది.

అయితే ఎక్కడ ఈ సినిమా మిస్ ఫైర్ అయిందో అర్థం కావడం లేదు.

హాయ్ నాన్న తరహా సినిమాలు మరిన్ని రావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. """/"/ హాయ్ నాన్న సినిమాకు సెకండ్ టెలీకాస్ట్ లో మంచి రేటింగ్స్( Hi Nanna TRP Rating ) వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమా మళ్లీ బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాల్సి ఉంది.గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.

నాని భవిష్యత్తు సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

నేడు బాబు .. రేపు జగన్ ! పేలుడు ఘటన బాధితులకు పరామర్శ