హోలీ( Holi ) రంగురంగుల పండుగ.ఈ పండుకుకు హోలీకా దహనమని కూడా ఒక పేరు ఉంది.
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు.అయితే కొత్తగా పెళ్లయిన మహిళలు మాత్రం అత్తవారింట హోలీ ఆడకూడదని పురాణాలు చెబుతున్నాయి.
వారు పుట్టింటికి వెళ్లి హోలీ ఆడాలని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తులో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పాల్గొన్న మాసంలో వచ్చే పూర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఈ హోలీ పండుగను జరుపుతారు.అయితే ఈ ఏడాది హోలీ మార్చి 25వ తేదీన రానుంది.
ఈ నేపథ్యంలోనే హోలీ పండుగను కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం అత్తవారింట జరుపకూడదు అని, ఆనవాయితీగా ఉందని పండితులు చెబుతున్నారు.పోలీస్ సందర్భంగా నిర్వహించే హోలీకా దహనాన్ని కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు తమ అత్తవారింట్లో చూడకూడదు.ఒకవేళ పొరపాటున అత్త కోడళ్ళు కలిసి హోళికా దహనం చూస్తే అత్తా కోడళ్ళకు మధ్య గొడవలు వస్తాయి.అంతేకాకుండా హోళికా దహనాన్ని గర్భిణీలు కూడా చూడకూడదు అని పండితులు చెబుతున్నారు.
అదే కొత్తగా పెళ్లయిన మహిళలు పుట్టింట హోలీ పండుగ జరుపుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
హోలీ పండుగ గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి.పార్వతీదేవి, శివుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.కానీ శివుడు తపస్సులో మునిగిపోతాడు.
అప్పుడు శివయ్యలో ప్రేమను పుట్టించేందుకు కామదేవుడైన మన్మధుడు మన్మధ బాణం వదులుతాడు.దీంతో కోపద్రిక్తుడైన శివుడు మూడో కన్ను తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు.
ఆ తర్వాత శివుడికి పార్వతి మొత్తం విషయాన్ని చెబుతోంది.ఆ తర్వాత విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు హోలీ రోజున అంటే పాల్గునమాసం పౌర్ణమి రోజున కొత్తగా పెళ్లయిన మహిళ అత్తగారింట్లో రంగులు చెల్లకూడదని శాపం ఉందని ఋషి పుంగవులు చెబుతున్నారు.
ఒకవేళ అలా ఆడితే అత్త కోడల మధ్య గొడవలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
.TELUGU BHAKTHI