ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి సమయం నిద్ర భంగం కాకుండా ఉండాలంటే సరైన ఆహారం( Food ) తీసుకోవాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.నిద్రకు ఇబ్బందికరంగా మారే ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.
మరి నిద్ర( Sleep )కు భంగం కలిగించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్లు వంటివి తింటే నిద్రకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మద్యం సేవిస్తే మత్తుగా నిద్ర పడుతుందని కొంత మంది అనుకుంటూ ఉంటారు.
కానీ ఇది నిద్ర భంగనికి గురి చేస్తుంది.అలాగే చక్కెర స్థాయిలో అత్యధికంగా ఉన్న స్వీట్స్( Sweets ) కూడా మోతాదుకు మించి తింటే రాత్రి నిద్ర సరిగా పట్టదు.అలాగే కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడ బిడ గా ఉండి నిద్ర దూరం అవుతుంది.
ఇంకా చెప్పాలంటే రాత్రి నిద్ర పోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు.అందువలన కడుపు కాస్త ఖాళీ ఉంచేలా చూసుకోవాలి.అలాగే స్పైసీ ఫుడ్( Spicy Food ) రాత్రి వేళ తీసుకుంటే దాని వల్ల గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అలాగే అధిక కొవ్వులతో కూడిన ఆహారమైన ఫ్రైడ్ ఫుడ్,మాంసాహారం( Non Vegetarian ) రాత్రి పూట తినకుండా వుండటం మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.అలాగే పుల్ల పుల్లగా ఉండే పండ్లను కూడా రాత్రి నిద్రకు ముందు తింటే వాటి వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
ఇంకా చెప్పాలంటే అధికంగా ఉప్పు తో కూడిన ఆహార పదార్థాల కు రాత్రి పూట దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.