తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )కి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు.ఎంపీ ఎన్నికల తరువాత తెలంగాణలో మార్గం సుగమం అవుతుందని చెప్పానన్నారు.
అది ఐదేళ్ల తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు.మీలో మీరు కొట్లాడి ప్రభుత్వం పడిపోతే వచ్చే ఎన్నికల్లో కావచ్చని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) బీఆర్ఎస్ -బీజేపీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదని విమర్శించారు.