Manchu Manoj : ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న భూమా మౌనిక… అసలు విషయం బయటపెట్టిన మనోజ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika Reddy ) ని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి వివాహం చేసుకున్న తర్వాత మనోజ్ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీ అవ్వడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

 Manchu Manoj Responded On Twins Born To Mounika And Gives Clarity-TeluguStop.com

ఈ విధంగా వీరి పెళ్లి జరిగినటువంటి కొన్ని నెలలకే మనోజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్త తెలిపారు మౌనిక ప్రెగ్నెంట్ ( pragnant ) అనే విషయాన్ని ఈయన అభిమానులతో పంచుకున్నారు.

Telugu Manchumanoj, Manoj, Mounika, Tollywood, Twins-Movie

ఇలా మౌనిక ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను మనోజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు.అయితే ఇటీవల హీరో శర్వానంద్ కు కుమార్తె జన్మించారు.ఇలా ఈయనకు కూతురు పుట్టడంతో మనోజ్ కి సంబంధించి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

మనోజ్ మౌనిక దంపతులకు కూడా పిల్లలు జన్మించారని అయితే ఈ విషయాన్ని వీళ్ళు బయటకు తెలియజేయడం లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఈ దంపతులకు కవల పిల్లలు ( Twins ) జన్మించారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Telugu Manchumanoj, Manoj, Mounika, Tollywood, Twins-Movie

ఈ విధంగా భూమా మౌనిక కవల పిల్లలకు జన్మనిచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనోజ్ ఈ వార్తలపై స్పందించారు.మా అభిమాన కుటుంబానికి శుభవార్త.నా సతీమణికి ప్రస్తుతం ఏడోవ నెల.తను ఆరోగ్యంగా ఉంది.ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాం.అయితే మాకు కవలలు పుట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఈయన కొట్టి పారేశారు.

అలాంటి సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలను మేము తెలియజేస్తాం అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube