మహిళలు ప్రెగ్నెన్సీ( Pregnancy ) సమయంలోనే కాదు డెలివరీ తర్వాత కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా శిశువులకు పాలిచ్చే అమ్మలు తీసుకునే ఆహారం విషయంలో అనేక నియమాలు పాటించాలి.
ఎందుకంటే తల్లి ఏ ఆహారం తీసుకుంటుందో, అదే ఆహారం బిడ్డకు పాల రూపంలో చేరుతుంది.అందుకే పాలిచ్చే అమ్మలు పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.
అదే సమయంలో కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.ఈ నేపథ్యంలోనే పాలిచ్చే అమ్మలు ఏయే ఆహారాలను అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రసవం అనంతరం తల్లులు కారం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు.కారంగా ఉండే ఆహారాలు శిశువులలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.అందుకే పాలిచ్చే తల్లులు స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే పిల్లలకు పాలిస్తున్న తల్లులు ప్రాసెస్ చేసిన ఆహారాల జోలికి వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మొదలైన వాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.ఇవి పాల ద్వారా శిశువుకు చేరతాయి.వారి అభివృద్ధి నెమ్మదించేలా చేస్తాయి.
టీ, కాఫీ ( Tea, coffee )వంటి పానీయాలను పాలిచ్చే తల్లులు చాలా మితంగా తీసుకోవాలి.అధిక మొత్తంలో కాఫీ, టీలు తీసుకుంటే అవి మీ శిశువు నిద్రలేమికి కారణం అవ్వొచ్చు.క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలు, చాక్లెట్, కొన్ని రకాల చేపలకు కూడా పాలిచ్చే అమ్మలు దూరంగా ఉండడమే మంచిది.
ఇక డెలివరీ అనంతరం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదని చాలా మంది భావిస్తుంటారు.తల్లులు సిట్రస్ ఫ్రూట్స్ తింటే పిల్లలకు జలుబు చేస్తుందని అనుకుంటారు.కానీ అది కేవలం అపోహ మాత్రమే.నిజానికి తల్లులు నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
అంతేకాదు, సిట్రస్ పండ్లు తల్లి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.రక్తహీనత ఏర్పడకుండా రక్షిస్తాయి.
మరియు పాలిచ్చే టైమ్ లో తల్లి శరీరం డీహైడ్రేట్ ( Dehydrate )అవ్వకుండా సైతం కాపాడతాయి.