Amarnath Ghosh : కళాకారులే టార్గెట్.. అమెరికాలో భారతీయ నృత్యకారుడి కాల్చివేత , రోజుల వ్యవధిలో రెండో ఘటన

ప్రముఖ టీవీ నటి , బిగ్‌బాస్ రెగ్యులర్ దేవోలీనా భట్టాచార్జీ( Devoleena Bhattacharjee ) అమెరికాలో కాల్చి చంపబడిన తన స్నేహితుడు , నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ల సహాయం కోరారు.సాథ్ నిబానా సాథియా , దిల్‌ దియాన్ గల్లాన్‌‌లలో నటించిన ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

 Indian Dancer Amarnath Ghosh Shot Dead In Us-TeluguStop.com

మంగళవారం సాయంత్రం యూఎస్‌లో కాల్చి చంపబడిన కోల్‌కతాకు చెందిన తన స్నేహితుడి గురించిన వివరాలను పంచుకున్నారు.అమర్‌నాథ్‌ అమెరికాలోని సెయింట్ లూయిస్ అకాడమీ( Saint Louis Academy ) పరిసరాల్లో కాల్చి చంపబడ్డాడని ఆమె తెలిపారు.

అతని తల్లి మూడేళ్ల క్రితం మరణించిందని .అమర్‌నాథ్ కోసం పోరాడటానికి కొద్దిమంది స్నేహితులు తప్పించి ఎవరూ మిగిలి లేరని దేవోలీనా ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Amarnath Ghosh, Indian, Jaishankar, Kolkata, Narendra Modi, Saintlouis-Te

ఈవినింగ్ వాక్ చేస్తుండగా.అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి అమర్‌నాథ్‌( Amarnath Ghosh )పై కాల్పులు జరిపి పరారయ్యాడని ఆమె వెల్లడించారు.అమెరికాలోని కొందరు స్నేహితులు అమర్‌నాథ్ మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్‌డేట్ లేదన్నారు.తమకు సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి దేవోలీనా ట్యాగ్ చేశారు.ఈ ఏడాది ప్రారంభం నుంచి జరుగుతున్న వరుస ఘటనలు అమెరికాలో భారతీయులు, భారతీయ విద్యార్ధుల భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

Telugu Amarnath Ghosh, Indian, Jaishankar, Kolkata, Narendra Modi, Saintlouis-Te

ఇకపోతే.సిక్కు కీర్తన బృందంలో సభ్యుడైన 29 ఏళ్ల భారతీయ సంగీతకారుడిని గత శనివారం అలబామా రాష్ట్రంలోని సెల్మా వద్ద గురుద్వారా వెలుపల కాల్చిచంపారు.మృతుడిని రాజ్ సింగ్, గోల్డీ అని కూడా పిలుస్తారు.ఆయన యూపీలోని బిజ్నోర్ జిల్లాలోని తండా సాహువాలా గ్రామానికి చెందివాడు.ఆయన గడిచిన ఏడాదికి పైగా తన సంగీత బృందంతో అమెరికాలో వుంటున్నాడు.గోల్డీ గురుద్వారా బయట నిలబడి వుండగా.

గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు.రాజ్ సింగ్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube