సాధారణంగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నటీనటులు భవిష్యత్తులో సినిమాల్లోనే హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది.అయితే చైల్డ్ ఆర్టిస్ట్( child artist ) గా పలు సినిమాలలో నటించి క్రేజ్ ను సొంతం చేసుకున్న హెచ్.
ఎస్.కీర్తన( H.S.Keertana ) ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.కన్నడలో సీరియళ్లతో పాటు సినిమాలు చేయడం ద్వారా కీర్తన ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.
సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు వస్తున్నా హెచ్.
ఎస్.కీర్తన మాత్రం చదువుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఐఏఎస్( IAS ) కావాలని అనుకున్నారు.ఎంతో కష్టపడి ఐఏఎస్ కావాలని అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.ఐదుసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోని కీర్తన ఆరో ప్రయత్నంలో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్నారు.ఆలిండియా లెవెల్ లో ఆరో ప్రయత్నంలో 167వ ర్యాంక్ ను ఆమె సాధించారు.
ప్రస్తుతం కీర్తన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్నారు.గతంలో కీర్తన రెండు సంవత్సరాల పాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా కూడా సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు.ఫెయిల్యూర్స్ ఎదురైనా సక్సెస్ సాధించవచ్చని కీర్తన సక్సెస్ స్టోరీతో ప్రూవ్ అయింది.
కీర్తన మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కీర్తన భవిష్యత్తులో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరింత కష్టపడితే కీర్తన కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరింత ఎక్కువమందికి స్పూర్తిగా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కీర్తన టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కీర్తనను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.బాల్యం నుంచి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటే ఆలస్యంగానైనా సక్సెస్ దక్కుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కీర్తన తమకు రోల్ మోడల్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.