పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు( Parliament budget meeting ) మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి.ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యులు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యారు.
ఉదయం 11 గంటలకు సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ) ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు.గత పార్లమెంట్ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఎక్కువ దృష్టి సారించనున్నారు.కాగా రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) ప్రవేశపెట్టనున్నారు.