ఈ ఆకును తలకు రాశారంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా మాయం అవ్వాల్సిందే!

చుండ్రు.పిల్లలు నుంచి పెద్దల వరకు ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

 Applying This Leaf On The Head Will Remove Dandruff! Dandruff, Dandruff Removing-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత ఈ చలికాలంలో చుండ్రు సమస్య( Dandruff ) చాలా అధికంగా ఉంటుంది.ఉష్ణోగ్రతలలో తగ్గుదల వల్ల నెత్తి మీద చ‌ర్మం పొడిగా మారి చుండ్రుకు దారి తీస్తుంది.

తీవ్ర‌మైన దుర‌ద‌ను క‌లిగిస్తుంది.చుండ్రు అధికమైతే హెయిర్ ఫాల్( Hair fall ) కంట్రోల్ తప్పుతుంది.

జుట్టు కూడా పలచబడుతుంది.కాబట్టి చుండ్రు సమస్యను వీలైనంత తొందరగా వదిలించుకోవాలని అందరూ భావిస్తుంటారు.

మీరు జాబితాలో ఉన్నారా.అయితే మీకు మునగాకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ ఆకును తలకు రాశారంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే మాయం అవ్వాల్సిందే.మరి ఇంతకీ మునగాకును తలకు ఎలా ఉపయోగించాలి అన్నది ఆల‌స్యం చేయ‌కుండా చ‌క‌చ‌కా తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడిని ( Munagaku powder )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి.

Telugu Dandruff, Dandruff Remedy, Care, Care Tips, Pack, Remedy, Latest, Moringa

ఆ తర్వాత అందులో రెండు స్పూన్లు ఆముదం( castor oil ) మరియు సరిపడా బియ్యం కడిగిన వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Dandruff, Dandruff Remedy, Care, Care Tips, Pack, Remedy, Latest, Moringa

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు కేవలం రెండు వాషుల్లోనే పూర్తిగా క్లియర్ అవుతుంది.స్కాల్ప్ హైడ్రేటెడ్ గా మరియు హెల్తీ గా మారుతుంది.చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.

పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం సైతం తగ్గు ముఖం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube