కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరి కాసేపటిలో గన్నవరం ఎయిర్ పోర్టు( Gannavaram Airport) కు చేరుకోనున్నారు.ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి కానూరుకు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు.
అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు( AP PCC Chief) గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు.తరువాత పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రరత్న భవన్ (Andhra rathna Bhavan )కు వెళ్లనున్న షర్మిల అక్కడ జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.కాగా ఎయిర్ పోర్టులో షర్మిలకు ఘన స్వాగతం(Grand Welcome) పలికేందుకు ఇప్పటికే భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.