సాధారణంగా ఎంత పెద్ద అగ్నిని అయినా నీటితో ఆర్పేయవచ్చు.మంటని ( Fire ) నీరు ఓడించి పెద్దగా కాకుండా చేయగలదు.
సాధారణంగా దాదాపు 99% సందర్భాల్లో ఇదే జరుగుతుంది.మనుషులు కూడా ఇదే మాటలను ఎవరైనా నమ్ముతారు.
కానీ ఒక వీడియో ఈ నమ్మకాన్ని తుడిచి వేస్తోంది.ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.
ఎందుకంటే ఆ వీడియోలో నీటి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్లు కనిపించింది.అదే నీటిలో మరో ప్రాంతంలో నీరు మరుగుతూ, ఉడుకుతూ కనిపించింది.
అది ఒక పెద్ద చెరువు లాగా కనిపిస్తోంది.కానీ దాని కింద ఎవరో పెద్ద మంట పెట్టినట్లుగా నీరు ఉడుకుతూ( Water Boiling ) కనిపించింది.దానిలో ఒకచోట మంటలు గ్యాస్ సిలిండర్ పెడితే ఎలా తీసి ఎగిసి పడతాయో ఆ రేంజ్ లో ఎగిసిపడుతున్నాయి.వీడియో మొదలు చివరి వరకు ఆ మంటలు అదే స్థాయిలో మండుతూ ఉన్నాయి.
ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ నదులలో ఒకటైన దక్షిణాఫ్రికాలోని వాల్ నదిలో( Vaal River ) ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది.
ఇలా మంటలు మండడానికి కారణం నీటిలో ఉన్న మిథేన్ వాయువుకు( Methane Gas ) ఎవరో నిప్పు అంటించారని వైరల్ వీడియోకు క్యాప్షన్ గా రాశారు.నెటిజన్ల ప్రకారం నీరు మరుగుతున్న, మంటలు ఎగసి పడుతున్న ప్రదేశంలో మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది.ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @gunsnrosesgirl3 షేర్ చేసింది.
కేవలం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు 50 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.చాలామంది ఈ వీడియో చూసి స్టన్ అవుతున్నారు.ఈ దృశ్యం అద్భుతంగా ఉందని పేర్కొంటున్నారు.నీటి అడుగున మీథేన్ వాయువు ఎలా ఉత్పత్తి అవుతుంది అని మరికొందరు ప్రశ్నించారు.
ఇది అసలు నిజం కాదేమోనని అనుమానించిన వారు కూడా లేకపోలేదు.ఈ వీడియోను మీరు కూడా చూడండి.