మహిళలు ఇల్లు, పిల్లలు, కుటుంబ బరువు, బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.వాళ్ళు పని అంతా చేసిన తర్వాత అలసిపోతారు.
దాంతో వాళ్ళు తీసుకునే ఆహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.పురుషులకంటే మహిళలకు ఎక్కువ పోషకాలు అవసరం.
కాబట్టి మహిళలు ఆహారం పట్ల శ్రద్ధ చూపించకపోతే కండరాల బలహీనత, రక్తపోటు, క్యాల్షియం( Weakness, blood pressure, calcium ) లోపం లాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే కొన్ని ఆహారాలను డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరంలో( dates ) ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండడం వలన మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరం అని చెప్పవచ్చు.ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.అయితే వాటి ఫైబర్ జీర్ణ క్రియలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే సహజ చక్కెర త్వరగా శక్తిని అందిస్తాయి.అలాగే ఖర్జూరాలు చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్లను కూడా కలిగి ఉంటాయి.
కాబట్టి ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.కొబ్బరి అనేది కూడా మహిళలకు మంచి పోషకాలను అందిస్తుంది.
ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండడం వలన ఇవి ఆర్ద్రీకరణకు తోడ్పడతాయి.అలాగే చర్మ ఆరోగ్యానికి తోడ్పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, పోషకాలు కూడా ఇందులో ఉండటం వలన చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది.
నల్ల ఎండు ద్రాక్షలో( black currants ) ఐరన్ అధికంగా ఉంటుంది.అవి అలసటతో పోరాడుతాయి.అలాగే రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.వాటిలో ఉండే సహజ చక్కెరలు శక్తిని అందిస్తాయి.అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ప్రకాశానికి కూడా దోహదం చేస్తాయి.నల్ల ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం వలన మహిళలకు చాలా మంచిది.
అలాగే చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది.ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఇందులో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఉన్నాయి.ఇవి చర్మానికి ప్రకాశం ఇవ్వడమే కాకుండా శరీరానికి కూడా తక్షణమే శక్తిని అందిస్తాయి.
కాబట్టి మహిళలు వీటన్నిటిని తీసుకోవడం వలన నిత్యం శక్తివంతంగా ఉంటారు.