ముక్కోటి ఏకాదశి( Mukkoti Ekadashi ) అంటే ధనుర్మాసంలో వచ్చే పరమ పవిత్రమైన రోజు.ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు.
అయితే ఆ రోజున ముఖ్యంగా వైష్ణవాలయలన్నీ భక్తులతో నిండిపోతాయి.ఉత్తర ద్వారా మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆరోజు భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు.
ఏడాదిలో 24 ఏకాదశిలు వస్తాయి.ప్రతి ఏకాదశి చాలా పవిత్రమైనది.
అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశలు నాలుగు.ఆ విశేష ఏకాదశిలలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి.
అయితే సూర్యుడు ఉత్తరయానానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని( Dhanurmasa Suddha Ekadashi ) ముక్కోటి ఏకాదశి అని అంటారు.కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవదూతలను, దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు.
ముర ఆక్రమాలను భరించలేక దేవతలు నారాయణస్వామి దగ్గర మొరపెట్టుకుంటారు.భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతడిని వధిస్తాడు.
ఆ రాక్షసుడు సాగర గర్భంలోకి దాక్కుంటే అతని బయటికి రప్పించేందుకు గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తారు.
![Telugu Devotional, Lord Vishnu, Sritirumala-Latest News - Telugu Telugu Devotional, Lord Vishnu, Sritirumala-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/Vaikuntha-Ekadashi-Lord-Vishnu-Dhanurmasa-Suddha-Ekadashi-Sri-Tirumala-Venkateswara-Temple.jpg)
అదే నిజం అనుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, ఆ సమయంలో శ్రీమహావిష్ణువు( Lord Vishnu ) నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది.ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తి ఏకాదశి అని నామకరణం చేశారు.అయితే వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఓ విశేషంగా చెప్పుకుంటారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతం ఆచరిస్తారు.
![Telugu Devotional, Lord Vishnu, Sritirumala-Latest News - Telugu Telugu Devotional, Lord Vishnu, Sritirumala-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/Lord-Vishnu-Dhanurmasa-Suddha-Ekadashi-Sri-Tirumala-Venkateswara-Temple.jpg)
అయితే ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వర ఆలయం( Sri Tirumala Venkateswara Temple )లోనూ ఎంతో కాలం నుండి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది.దీనికి వైకుంఠ ద్వారమని పేరు పెట్టారు.సూర్యుడు ఉత్తరాయన పుణ్యాకాల ప్రవేశానికి ఉత్తర ద్వారా శుభసంకేతం.
అయితే దక్షిణాయణంలో మరణించిన పుణ్యాత్ములు అందరూ కూడా వైకుంఠ ద్వారం తెరిచినప్పుడే దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.అందుకే భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజామున ఆలయాల్లో ఉత్తర ద్వారా భాగవత దర్శనార్థం కోసం వేచి ఉంటారు.
LATEST NEWS - TELUGU