తులసి మొక్కకు పసుపు కొమ్మును కడితే ఏమౌతుందంటే..?

జ్యోతిష్య శాస్త్రంలో తులసి మొక్కకు( Tulsi Plant ) సంబంధించిన ఎన్నో పరిహారాల గురించి వివరించబడింది.అయితే ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతుంటారు.

 Why We Should Tie Turmeric Knot To Tulsi Plant Details, Turmeric Knot ,tulsi Pl-TeluguStop.com

అయితే తులసి మాతను దైవంతో సమానంగా భావిస్తారు.అలాగే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా కొలుస్తారు.

అందుకే ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు తులసి మొక్కకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.అయితే పసుపు లేదా పసుపు కొమ్ముకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన స్థానం ఇవ్వడం జరిగింది.

ఎందుకంటే పసుపు కొమ్ము ఎన్నో సమస్యలను అలాగే లోపాన్ని తొలగిస్తుందని నమ్ముతారు.

అలాంటప్పుడు తులసి మొక్కకు పసుపు కొమ్ములు కట్టడం వలన ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కను లక్ష్మీదేవి( Lakshmidevi ) రూపంగా భావిస్తారు.అలాగే ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.

అంతేకాకుండా తులసి మొక్కకు పూజ చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కూడా నమ్ముతారు.అయితే కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో తులసి మాతకు పూజ చేయడం వలన అప్పుడే ఫలితాలు తగ్గుతాయి.

Telugu Bhakti, Devotional, Financial, Lakshmi Devi, Tulsi, Tulsi Pooja, Tulsi Tu

అంతేకాకుండా తులసి మాతతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.అయితే ఏ పూజకైనా స్వచ్ఛత పరిశుభ్రత చాలా అవసరం ఉంటుంది.అలాగే తులసి పూజలో కూడా స్వచ్ఛత పట్ల శ్రద్ధ వహించాలని అంటున్నారు జ్యోతిష్యులు.అయితే చాలా మందికి తెలిసో తెలియక కొన్ని పొరపాటులను చేస్తుంటారు.దీని వలన తులసి మొక్క అపవిత్రమవుతుంది.అలాగే శుభ ఫలితాలు కాస్త అశుభంగా మారి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu Bhakti, Devotional, Financial, Lakshmi Devi, Tulsi, Tulsi Pooja, Tulsi Tu

అయితే తులసి పూజలో మీరు తప్పులు చేస్తే ఇంట్లో పెద్ద వాస్తు లోపాలు వస్తాయి.అందుకే తులసి మొక్క స్వచ్ఛతను తిరిగి పొందడానికి పసుపు( Turmeric ) నివారణ అని అంటున్నారు జ్యోతిష్యులు.తులసి మొక్కకు పసుపు కొమ్మును కట్టడం వలన శుభప్రదంగా భావిస్తారు.అలాగే తులసి మొక్కపై పసుపును కూడా చల్లవచ్చు.ప్రతి శుక్రవారం తులసి పై పసుపు చల్లాలి.ఇలా పది శుక్రవారాలు 10 పసుపు కొమ్ములను కట్టాలి.

ఆ తర్వాత 11వ శుక్రవారం మిగిలిన 10 పసుపు కొమ్ములను నీటిలో ముంచాలి.ఇది తులసి మొక్కను శుద్ధి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube