ఓట్స్ తో రోజు ఇలా చేస్తే వద్దన్నా మీ స్కిన్ వైట్ గా మారుతుంది.. తెలుసా?

ఓట్స్.( Oats ) ఇటీవల కాలంలో వీటి వినియోగం భారీగా పెరిగింది.

 Best Way To Use Oats For Skin Whitening , Skin Whitening , Skin Whitening Rem-TeluguStop.com

ముఖ్యంగా హెల్త్, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్న వారు కచ్చితంగా తమ డైట్ లో ఓట్స్ ఉండేలా చూసుకుంటున్నారు.పోష‌కాల నిల‌య‌మైన ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తాయి.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచ‌డానికి కూడా సహాయపడతాయి.

ముఖ్యంగా స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి ఓట్స్ అద్భుతంగా సహాయపడతాయి.ఓట్స్ తో రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే వద్దన్నా కూడా మీ స్కిన్ వైట్ గా మ‌రియు బ్రైట్ గా మారుతుంది.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ ఓట్స్ పౌడర్ ను వేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Oats, Oats Benefits, Oats Face Pack, Skin Care, Ski

అలాగే వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్( Milk powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )మరియు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్( Orange juice )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఇది మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
https://telugustop.com/wp-content/uploads/2023/12/oats-oats-benefits-oats-face-pack-latest-news-skin-care-skin-care-tips-beauty-beauty-tips.jpg

Telugu Tips, Remedy, Latest, Oats, Oats Benefits, Oats Face Pack, Skin Care, Ski

ఫైన‌ల్‌గా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే స్కిన్ టోన్( Skin tone ) చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.వారం రోజుల్లోనే మీరు మీ చర్మం లో మార్పును గమనిస్తారు.

చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం తేమగా మారుతుంది.

మొండి మచ్చలు, మొటిమలు ఉంటే పరార్ అవుతాయి.క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube