వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువు సానుకూల మరియు ప్రతికూల శక్తిని ( Negative energy )కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.వాటిని సరైన స్థలంలో ఉంచకపోతే అది ఇంట్లో ప్రతికూలతను పెంచే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
దానివల్ల ఇంటి ఆర్థిక స్థితి కూడా ప్రభావితం అవుతుంది.ఎప్పుడు చికాకులు, గొడవలు జరుగుతూ ఉంటాయి.
అయితే అసలు ఇంటి ముందు ప్రధాన ద్వారం దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ముందు మురికి నీరు ఉండడం వాస్తు ప్రకారం అసలు మంచిది కాదు.
ఇంటి ప్రధాన ద్వారం ముందు మురికి నీరు ఉండడం అశుభంగా భావిస్తారు.
ఎందుకంటే మురికి నీటిలో అనేక రకాల బ్యాక్టీరియా( Bacteria ) ఉంటుంది.అందుకే ఇంటి ముందు మురికి నీరు ఉంటే వెంటనే తొలగించాలి.రెండవది ఇంటి ముందు ముళ్ళ మొక్కలు అస్సలు ఉండకూడదు.
ఇంటి ముందు ముళ్ళ మొక్కలు ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి.దీనికి బదులుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను పెంచుకోవాలి.
ఇంకా చెప్పాలంటే ఇంటి ముందు విద్యుత్ స్తంభం కూడా అసలు ఉండకూడదు.ఇంటి ముందు విద్యుత్ స్తంభం( Electric pole ) ఉంటే కుటుంబ సభ్యుల అభివృద్ధి ఆగిపోతుంది.
ప్రధాన ద్వారం ముందు కరెంట్ స్తంభం ఉండడం చాలా హానికరం.అంతేకాకుండా రేడియేషన్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం( Main entrance ) ముందు పెద్ద పెద్ద చెట్లు అస్సలు ఉండకూడదు.దీని వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి.ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం నుంచి సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.అలాగే మన ప్రధాన గుమ్మం కంటే ఎక్కువ ఎత్తులో రహదారి ఉంటే అది అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు ఎప్పుడు చెల్లాచెదురుగా ఉండకూడదు.ఇది ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది.ఈ నియమాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల మీ ఇంట్లో సానుకూల ఫలితాలు ఉంటాయి.మీరు ప్రతి ఒక్క విషయంలోనూ విజయం సాధిస్తారు.
అలాగే ఆర్థికపరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు.
LATEST NEWS - TELUGU