Mani Ratnam : మణిరత్నంకు స్పెషల్ విషెస్ చెప్పిన కమల్ హాసన్.. మీతో బంధం దేవుడిచ్చిన వరం అంటూ?

Kamal Haasan Wishes Legendary Director Mani Ratnam

తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ మణిరత్నం( Director Mani Ratnam ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు మణిరత్నం.

 Kamal Haasan Wishes Legendary Director Mani Ratnam-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్క హీరో కూడా ఆయన దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని కోరుకుంటూ ఉంటారు.తెలుగు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలతో మంచి మంచి సినిమాలను తెరకెక్కించారు మణిరత్నం.

ఇక ఈయనకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

సినిమా ఇండస్ట్రీలలో ఉన్న అద్భుతమైన దర్శకులలో మణిరత్నం కూడా ఒకరు అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.పలువురు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే హీరో కమల్ హాసన్( Kamal Haasan ) కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు.కమల్ హాసన్ మణిరత్నం ఇద్దరూ స్నేహితులు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

స్నేహితుడు పుట్టినరోజు( Friend’s birthday ) సందర్భంగా కమల్ హాసన్ ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.ఈరోజు నాకెంతో ప్రత్యేకం.ఎందుకంటే నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు మణిరత్నం పుట్టినరోజు.ఆయన తనకున్న ప్రతిభతో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు.తన సినిమాలోని మాటలు డైలాగులు, విజువల్స్ తో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తారు.నిరంతరం నేర్చుకుంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సినిమాకు ఉన్న భాష పరమైన హద్దులను తొలగించారు.

రానున్న తరం దర్శకులు ఎంతోమందికి మీరు ఆదర్శం.మీరు సాధించిన మీ ప్రేమాభిమానాలు శాశ్వతంగా ఉంటాయి.

నాయకుడు సినిమా నుంచి ఇప్పుడు రాబోతున్న సినిమాల వరకు సాగిన మన ప్రయాణం ఎంతో అపురూపం.కేవలం నటన పరంగానే కాదు వ్యక్తిగతంగాను మన ప్రయాణం ఒక వరం.ఆ దేవుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తాను అని రాసుకొచ్చారు కమల్ హాసన్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube