ఏపీ రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి.మొన్నటి దాకా నువ్వా…నేనా ? అన్నట్టు ఉన్న నేతలు మీరు.మేము ఒక్కటే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.మొన్నిటి దాకా టీడీపీ, జనసేన బంధం పై వన్‌సైడ్ లవ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చాడు.ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కూడా పవన్ టీడీపీకి సిగ్నల్ ఇచ్చి దానిని టూ సైడ్ లవ్ చేశారని టాక్.అయితే అన్ని పార్టీలను కలుపుకు పోవాలని చెప్పిన మాట వెనక టీడీపీనే కారణం అని తెలుస్తోంది.
ఇప్పటి వరకైతే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం.
ఒకవేళ పొత్తు కుదిరితే సీఎం పదవి విషయంలో ఎవరనే సందేహం తలెత్తుతోంది.
మరోవైపు తాను సీఎం కావాలని పవన్ పట్టుబడుతున్నారు.ఎప్పటికీ తామే త్యాగం చేయాలా .? ఈసారి టీడీపీ తగ్గాలని జనసేన సందేశాలిస్తున్నట్టు సమాచారం.అయితే పొత్తుల విషయంలో అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఒకవేళ వేరువేరుగా పోటీ చేస్తే రెండు పార్టీలకు నష్టమేనని సమాచారం.విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకు తీరని నష్టమే అని తెలుస్తోంది.
మొత్తంగా పొత్తు పట్టాలెక్కించేందుకు ఇరువర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట.అయితే పొత్తు విషయంలో చంద్రబాబు పెద్ద త్యాగం చేయాలనే టాక్ వస్తోంది.
ఎందుకంటే సీఎం సీట్ పవన్‌కి ఇవ్వక తప్పదు.అలాగే టీడీపీ ఈ విషయంలో పైచేయిలా ఉండేలా చేసేదానిపై ఫోకస్ పెట్టారట.
వచ్చిన సీట్ల ఆధారంగా అధికారవాట నిర్ణయించుకోవాలని టీడీపీ సీనియర్లు పేర్కొంటున్నారు.జనసేన నుంచి మాత్రం అధికార వాటా తేలాలని కోరుతోందట.
మొత్తం ఐదేండ్లు ఒకరే కాకుండా చెరి రెండున్నరేండ్లుగా నిర్ణయించుకోవాలని యోచిస్తున్నారట.
సహజంగా ఎక్కువ సీట్లు పోటీ చేసే టీడీపీకే ఎక్కవ సీట్లు వస్తాయి కాబట్టి మూడేండ్ల పాటు టీడీపీ సీఎం ఉంటే రెండేండ్ల పాటు జనసేన సీఎం ఉంటారని పేర్కొంటున్నారు.ఈ విషయంలో ఫస్ట్ ఛాన్స్ తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడితే మాత్రం ఇక సీఎం పవన్‌గా ఉంటారు.లోకేష్ మాత్రం డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ చైర్మెన్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.పొత్తుపొడిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే .ఏ నిర్ణయాలైనా తీసుకోవాలంటే బాబుదేనని టాక్.మరి వారి కలల లోకంలో ఎవరు సీఎం ? ఎవరు డిప్యూటీ సీఎం ? అనేది వేచి చూడాలి.