యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవర.ఈ సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) అధికారికంగా ప్రకటించాడు.అందుకు సంబంధించిన కారణాలను కూడా ఆయన వెళ్లడించాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ సగం వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ లో మొదటి భాగం విడుదల అవ్వబోతుంది.రెండో భాగం కి సంబంధించిన షూటింగ్ కు ఆలస్యం అవ్వబోతుంది.
వార్ 2( War 2 ) మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా లను ఎన్టీఆర్ చేయాల్సి ఉంది.ఆ తర్వాత దేవర 2 సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.దేవర 1 ఫ్లాప్ అయితే అసలు దేవర 2 ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి దేవర 2 గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ వచ్చింది.ఎలాంటి సందేహం లేదు.
సినిమా ను విడుదల చేయబోతున్నాం.సినిమా కు సంబంధించిన షూటింగ్ విషయంలో ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.
దేవర 1 తో పాటు దేవర 2 సినిమా షూటింగ్ కూడా లైన్ గా జరుగుతుందని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది.దేవర 2 గురించి జరుగుతున్న చర్చను పట్టించుకోవద్దు అంటూ మేకర్స్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియా లో కొందరు యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు.దేవర 1 సినిమా ను సమ్మర్ లో విడుదల చేసి ఏడాది తిరగక ముందే దేవర 2 ను కూడా విడుదల చేస్తామని కొరటాల శివ చెబుతున్నాడు.
దేవర సినిమా గురించి ముందు ముందు మరెన్ని పుకార్లు వినాల్సి వస్తుందో…!