తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పరిధిలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నాట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రూ.కోట్ల లో రుణాలు పొందునట్లు ఆడిట్ లో బయటపడింది.
సోమవారం వెలుగుచూసిన ఈ వ్యవహారంలో టీటీడీలో అటెండర్ స్థాయి నుంచి డిప్యూటీ స్థాయి ఈవో వరకు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.దీనిపై స్పందించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి 49 ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న ఉద్యోగులు వివరణ పై తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ నిబంధనల మేరకు టీటీడీ లో ఉద్యోగి క్యాడర్ మేరకు హౌస్ బిల్డింగ్ లోన్ ఇస్తారు.వేతనం ఆధారంగా అటెండర్ స్థాయి ఉద్యోగికి రూ.10 లక్షలు సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రూ.12.5 లక్షలు సూపర్డెంట్ కి రూ.15 లక్షలు లక్షలు, ఏఇఓ ఆపై స్థాయి అధికారులకు రూ.20 లక్షల వరకు రుణం ఇస్తారు.అయితే బిల్డింగ్ కట్టకుండానే తప్పుడు పత్రాలు చూపించి లోన్ తీసుకున్న ఘటనలు వెలుగుచూడటంతో ఐదు సంవత్సరాల క్రితమే విజిలెన్స్ ఎంక్వైరీకి అప్పటి ఈవో సాంబశివరావు ఆదేశించారు.

2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ నివేదిక సమర్పించినప్పటికీ చర్యలు మాత్రం వాయిదా పడుతూనే వచ్చాయి.ఇటీవలే వరుసగా అక్రమాలకు పాల్పడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో చర్చలు తీసుకుంటున్న ఈవో జవహర్ రెడ్డి గత ఆరు నెలల కాలంలో 23 మంది ఉద్యోగులను సర్వీస్ నుండి డిస్మిస్ చేశారు.మరికొందరు కొంతమంది పై క్రమశిక్షణ చర్యలుతో సరిపెట్టిన ఈవో తాజాగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.