కార్తీకమాసంలో శివునికి రుద్రాభిషేకం ఎలా చేస్తారో తెలుసా..?

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజున భక్తులు శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.ఆయన అనుగ్రహం కోసం ఆలయాలను సందర్శించి దీపాలు వెలిగిస్తారు.

 Do You Know How Rudrabhishekam Is Performed To Lord Shiva In The Month Of Kartik-TeluguStop.com

ఇలా కార్తీక పౌర్ణమిని దీపాలను వెలిగించి పూజ చేయడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు( Devotees ) విశ్వసిస్తారు.ఇదే సమయంలో అభిషేక ప్రియుడైన శివునికి పాలు, తేనెతో అభిషేకం చేస్తారు.

దీనిని రుద్రాభిషేకం అని పిలుస్తారు.అలాగే కార్తిక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పురాణాలలో ఉంది.

ఈ మాసంలో తులసి పూజ( Tulsi Puja )చేయడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని స్వర్గానికి నేరుగా చేరే అవకాశం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

Telugu Devotional, Problems, Lord Vishnu, Scholars, Tulsi Puja-Latest News - Tel

అంతేకాకుండా నిత్యం తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల కుటుంబ సమస్యలు( Family problems ) అన్ని దూరమైపోతాయని చెబుతున్నారు.అంతే కాకుండా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో నదీ స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఎలాగంటే శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటకు పంపడమే కార్తిక స్నాన ప్రధాన ఉద్దేశం అని పండితులు( Scholars ) చెబుతున్నారు.

Telugu Devotional, Problems, Lord Vishnu, Scholars, Tulsi Puja-Latest News - Tel

మన శరీరం ఉష్ణ శక్తికి కేంద్రంగా ఉంటుంది.ఎప్పటికప్పుడు ఉష్ణ శక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది.అలా ఎప్పటికప్పుడు ఉష్ణ శక్తి బయటకు పోతేనే మనం ఉత్సాహంగా ఉండగలము.ఈ ప్రక్రియ ను ఎలెక్ట్రో మాగ్నెటిక్ యాక్టివిటీ అని కూడా పిలుస్తారు.ఇంకా చెప్పాలంటే కార్తిక స్నానం చెయ్యడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కాబట్టే పూర్వం రోజులలో ఆధ్యాత్మికం, దేవుడు పేరు చెప్పి నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమని చెప్పేవారు.

అలాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులు చల్లటి నీటితో స్నానం చేసిన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని కూడా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube